రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఏపీకి ప్రత్యేకహోదా కోసం ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై తెలుగుదేశం ఎంపీలతో పాటు దానికి మద్దతిచ్చిన ఇతర 11 పార్టీల ఎంపీలు ఈ బిల్లుపై ఓటింగ్ జరపాలని పట్టుపట్టాయి. ఈ సందర్బంగా చర్చ జరిగి బిల్లుపై ఓటింగ్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఇతర పార్టీల ఎంపీలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుని జీఎస్‌టి బిల్లుతో ఎందుకు లింక్ పెట్టలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అందరు ఎంపీలు కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతున్నారు. కాగా చర్చ, ఓటింగ్ ఉంటాయని భావించినా, ఏపీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, నటుడు చిరంజీవి మాత్రం సభకు హాజరుకాలేదు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ సభకు డుమ్మాకొట్టడం పట్ల ఎంపీలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రత్యేకహోదా వంటి కీలక అంశాల విషయంలో చర్చలో పాల్గొనకుండా చిరంజీవి మాత్రం తన 150వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండటంతో టిడిపితో సహా ఇతర పార్టీల ఎంపీలు కూడా చిరు వైఖరిపై మండిపడుతున్నారు.