Advertisementt

నవ్వాపుకోలేక పోయిన మోడి.. !

Mon 08th Aug 2016 12:35 PM
  నవ్వాపుకోలేక పోయిన మోడి.. !
నవ్వాపుకోలేక పోయిన మోడి.. !
Advertisement
Ads by CJ

సాధారణంగా ప్రధానమంత్రి మోదీ ఎప్పుడు సీరియస్‌గానే ఉంటాడు. ఆయన నవ్వే సందర్భాలు అతితక్కువ అని ఆయన సహచరులు కూడా అంటూ ఉంటారు. కానీ ఒక ఎంపీ మాత్రం ప్రధాని మోడీని బాగా నవ్వించాడట. అది కూడా మన ఏపీకి చెందిన ఎంపీ కావడం విశేషం. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ విషయానికి వస్తే ఆయన సకల కళావల్లభుడు. సినిమా నటునిగా, దర్శకునిగా, మాటల రచయితగా ఆయన మనకు బాగా పరిచయం. ఇక రాజకీయాల్లో కూడా ఆయన వివిధ వేషాలు ధరిస్తూ, విభిన్నపనులు చేస్తూ, తన వాక్చాతుర్యంలో అనర్గళంగా ప్రసంగించగల నాయకుడు ఆయన. కాగా మోదీని ఏపీ టిడిపి ఎంపీలు కలిసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఎంపీ శివప్రసాద్‌ మోదీతో ఏపీలో అన్ని చోట్లా 'నమో' 'నారా'యణాయ జపం జరుగుతోందని ఇందులో 'నమో' అంటే నరేంద్రమోదీ అని, 'నారా' అంటే నారా చంద్రబాబునాయుడు అని చమత్కరించాడట. దాంతో మోదీ నవ్వాపుకోలేక పగలబడి నవ్వాడని, దీన్ని గమనించిన వెంకయ్య మోదీ ఇంతలా నవ్వారంటే ఇక మీ పని జరిగినట్లే అని శివప్రసాద్‌కు కితాబిచ్చారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ