Advertisementt

గ్యారేజ్ కి సమంత మెయిన్ కాదంట!

Mon 08th Aug 2016 12:28 PM
janatha garage,nithya menon,samantha,jr ntr,main heroine  గ్యారేజ్ కి సమంత మెయిన్ కాదంట!
గ్యారేజ్ కి సమంత మెయిన్ కాదంట!
Advertisement
Ads by CJ

కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'జనతా గ్యారేజ్'. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు నటిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్ లు నటిస్తున్నారు. వారిలో సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నిత్యామీనన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో సమంతానే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేస్తుందని అనుకుంటున్నారు చాలామంది. అవును మెయిన్ హీరోయిన్ కాబట్టి అలా అనుకోవడం సహజం. కానీ అది నిజం కాదంట... ఈ సినిమాలో నిత్యదే మెయిన్, లీడింగ్ కేరెక్టర్ అని... సమంత కేవలం గ్లామర్ ఒలకబోస్తూ నటించడమే అని సమాచారం. నిత్య మాత్రం ఎన్టీఆర్ కి భార్య గా నటిస్తుందని... ఆమె పాత్రే 'జనతా గ్యారేజ్' సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారని... ఈమె వల్లే కథ ఒక మలుపు తీసుకుంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే. ఇక దేవిశ్రీ సంగీతం అందిస్తున్న 'జనతా గ్యారేజ్' ఆడియోని ఆగష్టు 12 న విడుదల చేసి.. సెప్టెంబర్ 2 న సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ