నాకు న్యాయం జరిగేవరకూ పోరాడతాను -నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్
తమిళ సూపర్ హిట్ మూవీ జూలీగణపతి రైట్స్ కొన్న కూనిరెడ్డి శ్రీనివాస్
జూలీ గణపతి స్టార్ ఇమేజ్ నటీనటులతో రీమేక్ చేసేందుకు సన్నాహాలు
అనుమతి లేకుండా చారుశీల చిత్రంలో సన్నివేశాల చౌర్యం
చారుశీల నిర్మాతల చౌర్యంపై కోర్టును ఆశ్రయించిన నిర్మాత
ప్రణతి క్రియేషన్స్ సంస్థ అధినేత, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తమిళంలో సూపర్‌హిట్ అయిన జూలీ గణపతి మూవీ తమిళ్ డబ్బింగ్, రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఈ చిత్రానికి బాలు మహేంద్ర దర్శకుడు. జూలీ గణపతి చిత్రంలో జయరామ్,సరిత హీరో,హీరోయిన్స్‌గా నటించారు. ఈ సందర్భంగా నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...
ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ తీసుకుని... స్టార్ ఆర్టిస్ట్‌లతో రీమేక్ చేయాలని ఇంతకాలం రిలీజ్ చేయలేదు. అయితే చిత్ర పరిశ్రమలో ప్రముఖులుగా ఉన్న కొందరు ఈ చిత్రం కథను చోర్యం చేసి, జూలీ గణపతి చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని కాపీ కొట్టారు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు ఆధారాలతో తెలుపగా నిర్యక్ష్య ధోరణి ప్రదర్శంచారు...చివరకు కోర్టును ఆశ్రమించినా, చారుశీల చిత్రాన్ని రిలీజ్ డేట్ ప్రకటించడం జరిగింది. గతంలో మా ప్రతిష్టాత్మక ప్రణతి క్రియేషన్ బ్యానర్‌పై ఏడు చిత్రాలను నిర్మించాను. పది చిత్రాలను డబ్ చేశాను. పది చిత్రాలను డబ్బింగ్, రీమేక్ రైట్స్ నిర్మాతగా తీసుకున్నాను. జూలీ గణపతి చిత్రానికి సంబంధించి డబ్బింగ్, రీమేక్ రైట్స్ తీసుకున్నాను. ఈ చిత్రాన్ని రీమేక్ చేద్దాం అని శూర్పణక అనే టైటిల్‌ను సైతం రిజిస్టర్ చేయించాను. ఇదే టైటిల్ పెడదాం అని జూలీ గణపతి టైటిల్‌ను రిజిస్టర్ చేశాను. హీరోయిన్ నమితకు ఈ కథను వినిపించాను. రాశితో ఈ చిత్రాన్ని చేద్దాం అనుకున్నాం. డమరకం శ్రీనివాస్‌రెడ్డి ఈ కథను అడిగారు. మేమే ఈ చిత్రాని రీమేక్ చేసే ఉదేశ్యంతో ఉన్నాం అని చెప్పాం. మేలో అనుకోకుండా చారుశీల స్టిల్స్ చూస్తుంటే నా చిత్రంలా ఉన్నాయి. మా జూలీ గణపతి చిత్రంలో స్టిల్స్ పోలి ఉన్నాయి అని దర్శకుడు సాగర్ గారితో మాట్లాడమని ప్రసన్న కుమార్ గారికి చెప్పడం జరిగింది. సాగర్ గారు షూటింగ్ జరుగుతుంది ఫస్ట్ కాపీ వచ్చాక చూద్దాం అన్నారు. స్పందన లేక పోవడంతో చారుశీల చిత్రం నా చిత్రానికి దగ్గరగా ఉందని కోర్టులో దాఖలు చేశాను. మూడున ఆర్గ్యుమెంట్ చేశారు కూడా, ఈ లోగా చారుశీల చిత్రానికి 18న రిలీజ్ డేట్ ప్రకటించారు. మూడు నెలలుగా ఈ విషయం జరుగుతున్నా ఇంత వరకు ఎవరికీ చెప్పుకోలేదు. ఈ లోగా చారుశీల టీజర్‌ను రిలీజ్ చేశారు. నా సినిమా పోలిన సన్నివేశాలు చారుశీల టీజర్‌లో ఉన్నాయి. నా చిత్రం మీద కాపీ రైట్ ఉంది. బాలు మహేంద్ర జూలీ గణపతి చిత్రం తీయడమే కష్టం అన్నారు. ఇంగ్లీషు చిత్రం, నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాను అని చిత్రం విజయం సాధించిన సమయంలో బాలు మహేంద్ర స్వయంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని పెద్ద స్టార్స్‌తో రీమేక్ చేద్దాం అని ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ని చిత్రాలను నిర్మించి నిర్మాతగా పేరున్న నాకే నేను తీసుకున్న చిత్రం రైట్స్ ప్రక్కన పెట్టి , చిత్రాన్ని కాపీ కొట్టారు. అదే సామాన్యల పరిస్థితి ఎలా ఉంటుంది. సినిమాలో ప్రతి సన్నివేశాన్ని మక్కికి మక్కికి కాపీ కొట్టారు. నన్ను పట్టించుకోకుండా చారుశీల చిత్రానికి డేట్ అనౌన్స్ చేశారు. మీడియా ముందుకు రాక తప్పలేదు. బయ్యర్లకు తెలియ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రెస్ మీట్ పెట్టాను అన్నారు.