Advertisementt

ఇండియాలోనే 'ఇండియాస్ డాటర్' కు కష్టాలు!

Sat 06th Aug 2016 06:29 PM
india,indias daughter,documentary,new delhi high court  ఇండియాలోనే 'ఇండియాస్ డాటర్' కు కష్టాలు!
ఇండియాలోనే 'ఇండియాస్ డాటర్' కు కష్టాలు!
Advertisement

భారతదేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై దుర్ఘటన జరిగి ప్రపంచమంతా సంచలనం రేపిన కేసు విషయం తెలిసిందే. బిబిసి నిర్భయ ఘటనపై 'ఇండియాస్ డాటర్' అని ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించింది. అయితే ఈ డాక్యుమెంటరీని భారత్ నిషేధించింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ కేసులో దోషిగా పేర్కొన్న ఓ వ్యక్తి వాంగ్మూలం కూడా అందులో పొందుపరచబడింది. అసలు ఈ డాక్యుమెంటరీని ట్రయిల్ కోర్టు భారత్ లో ప్రసారం కాకుండా అప్పట్లో నిషేధించడంతో సంచలన అంశంగా మారింది. 

అయితే ఈ విషయంపై యువకులైన ఓ ముగ్గురు న్యాయవాదులు పూనుకొని సాక్షాత్తు కేసులో దోషిగా ఉన్న ఓ వ్యక్తి ఆలోచనలను ప్రతిబింబించే ఆ డాక్యుమెంటరీని నిషేధించడం ఏంటని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేవలం ప్రాథమికమైన సమాచారం ఆధారంగానే ఎలా ట్రయిల్ కోర్టు ఆ డాాక్యుమెంటరీని నిషేధిస్తుందని ఆ పిటిషనర్లు అందులో పేర్కొన్నారు. ఇంకా లాజిక్ గా మాట్లాడుతూ అంతర్జాలంలో అందుబాటులో ఉన్న డాక్యుమెంటరీని నిషేధించడమంటే అంతకు మించిన అవివేకం మరొకటి ఉండదని కూడా కోర్టు విచారణలో వ్యక్తమైంది. అప్పట్లో పోలీసులను కూడా నిషేధం విషయంపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే విచారణ అంతా జరిపి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఇప్పుడు నిషేధాన్ని ఎత్తివేయలేం అన్నట్లు చేతులెత్తేసినట్లుగా ప్రకటించింది. కాగా 2012 డిసెంబర్ 16 న జరిగిన నిర్భయ ఘటనపై బిబిసి ఫిల్మ్ మేకర్ 'లెస్లీ ఉడ్విన్'.. 'ఇండియాస్ డాటర్' అనే డాక్యుమెంటరీని రూపొందించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement