Advertisementt

చిరు 150 విషయంలో అస్సలు తగ్గట్లే..!

Sat 06th Aug 2016 05:11 PM
chiranjeevi,megastar,veena step,indra,150th movie,lawrence  చిరు 150 విషయంలో అస్సలు తగ్గట్లే..!
చిరు 150 విషయంలో అస్సలు తగ్గట్లే..!
Advertisement
Ads by CJ

చిరంజీవి అంటేనే డ్యాన్స్‌లకు పెట్టింది పేరు. ఆయన బ్రేక్‌ డ్యాన్స్‌లు, షేక్‌ డ్యాన్స్‌లంటూ తన స్టెప్పులతో మెగాస్టార్‌గా నిలిచాడు. నిజానికి ఆయన మెగాస్టార్‌ కావడానికి చిరు వేసే స్టెప్పులే ముఖ్యకారణంగా చెప్పవచ్చు. ఇకపోతే చిరంజీవి కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలిచిన 'ఇంద్ర' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మెయిన్‌ హైలైట్‌గా నిలిచిన వాటిల్లో ఆయన వేసిన వీణస్టెప్పు అత్యద్బుతం. ఆ స్టెప్పును ఇప్పటికీ చాలా మంది చేస్తూ ఉంటారు. అసలు ఈ స్టెప్పు కోసమే ఈ చిత్రాన్ని చూడటానికి రిపీట్‌ ఆడియన్స్‌ వచ్చారు. కాగా చిరు ప్రస్తుతం తాను చేస్తున్న 150వ చిత్రంలో కూడా అదే అద్భుతాన్ని రిపీట్‌ చేయనున్నారని టాక్. లారెన్స్‌ కంపోజ్‌ చేసిన ఓ స్టెప్పు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రం ద్వారా మెగాస్టార్‌ సరికొత్త డ్యాన్స్‌లను పరిచయం చేయబోతున్నారని కూడా సమాచారం. మరి ఆరు పదులు దాటిన వయసులో కూడా మెగాస్టార్‌ మునుపటిలా తన డ్యాన్స్‌లతో ఎలా అలరిస్తాడు? మునుపటి వేగం సాధించగలడా.. లేదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ