Advertisementt

కలర్స్ స్వాతికి కూడా ఆ ఆలోచనలు!

Fri 05th Aug 2016 09:32 PM
colors swathi,marriage thoughts,swathi,karthikeya,swari ra ra,nikhil  కలర్స్ స్వాతికి కూడా ఆ ఆలోచనలు!
కలర్స్ స్వాతికి కూడా ఆ ఆలోచనలు!
Advertisement
Ads by CJ

'అష్టా చెమ్మా, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర' వంటి  గొప్ప హిట్ సినిమాల్లో నటించింది హీరోయిన్ స్వాతి. ప్రస్తుతం నిజంగానే ఆమెకు అవకాశాలు రావడం లేదా అంటే లేదనే చెప్పాలి. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో చలాకీగా నటన మీదే ధ్యాస పెట్టి పరుగులెట్టిన స్వాతికి.. ఇప్పుడు చేతిలో ఎటువంటి సినిమాలు లేక బోరుకొడుతుందట ఈ తెలుగు ముద్దుగుమ్మకి. నిజానికి స్వాతి మంచి హిట్  సినిమాల్లో నటించినప్పటికీ  కూడా ఇప్పుడు ఏ ఒక్క అవకాశం తన తలుపు తట్టడం లేదట. అయితే అప్పట్లో నిఖిల్ తో  రెండు సినిమాలలో నటించడం వల్ల ఆమెకు నిఖిల్ తో ఏదో విషయం నడిచిందనే సంగతి కూడా బాగా ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని నిఖిల్ చాలా తేలికగానే కొట్టి పారేశాడు. అయితే ఇప్పుడు చేతిలో ఎలాంటి సినిమాలు లేవు  కనుక ఇక ఖాళీగా ఉండి ఏం చేస్తాం..  పెళ్ళి చేసుకుంటే ఓ పనైం పోతుంది కదా అనుకున్న స్వాతి మనసులోని వార్త.. పరిశ్రమ చుట్టూతా చక్కర్లు కొడుతుంది. అందుకనే  స్వాతి ఈ మధ్య కాలంలో  పెళ్లి  దిశగా ఆలోచన చేస్తుందని సమాచారం. అయితే స్వాతి కోసం ఆమె తల్లి పలు సంబంధాలు చూస్తుందని వినికిడి. ఈ సంవత్సరం చివరికల్లా స్వాతి పెళ్లి జరగడం ఖాయమన్నది సమాచారం. అయితే స్వాతి సినిమా పరిశ్రమకు సంబందించిన వ్యక్తిని పెళ్లాడుతుందా లేక బయటి వ్యక్తిని పెళ్లాడుతుందా అనేది మాత్రం తెలియదు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ