రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా కోసం రాజ్యసభలో గళమెత్తి ప్రత్యేకహోదా కోసం పోరాడిన వ్యక్తిగా వెంకయ్యనాయుడుకి మంచి పేరొచ్చింది. కానీ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో వెనకడుగు వేసింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రజలు వెంకయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మోదీని, అమిత్‌షాలను దిక్కరించి వెంకయ్య ఏమీ చేయలేని పరిస్థితి. అయితే గత వారం రోజులుగా కేవలం ఏపీ ప్రత్యేకహోదా లేదా దానిని మించిన ప్యాకేజీలను ఇవ్వాలని అమిత్‌షా. అరుణ్‌జైట్లీలతో వెంకయ్య మంతనాలు జరుపుతున్నారు. ఏపీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని, ఇంకా ఆలస్యం చేస్తే ఏపీలో పార్టీ ఎప్పటికీ బలపడలేదని ఆయన వారికి విజ్ఞప్తి చేస్తున్నాడు. తాజాగా వెంకయ్య సమక్షంలోనే అమిత్‌షా, అరుణ్‌జైట్లీ, నీతి ఆయగ్ వైస్‌చైర్మన్‌లతో పాటు ఆర్దిక శాఖా అధికారులతో ఓ సమావేశం జరిగింది. దీంతో బిజెపి మరో వారంలోపు ఏపీకి ప్రత్యేకహోదా లేదా ఆర్దికప్యాకేజీ విషయంలో తమ నిర్ణయాన్ని స్పష్టం చేసే అవకాశం కల్పిస్తున్నాయి. పాపం.. వెంకయ్య ప్రయత్నాలు ఫలించి ఏపీ కి కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం చేస్తుందో.. లేదో ఇంకో వారం రోజుల పాటు వేచి చూడాలన్న మాట.