Advertisementt

రవితేజా.. ముందు చేయాల్సింది చెయ్!

Fri 05th Aug 2016 01:34 PM
raviteja,bengal tiger,makeover,raviteja movies,raviteja remuneration  రవితేజా.. ముందు చేయాల్సింది చెయ్!
రవితేజా.. ముందు చేయాల్సింది చెయ్!
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో ఎవరి సహాయం లేకుండా కష్టపడి  పైకి వచ్చిన వారిలో రవితేజ ఒకడు. తన కెరీర్ లో హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే రవితేజ ఈ మధ్య ఖాళీగా ఉంటున్నాడు. 'బెంగాల్ టైగర్' వచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా ఇంకో సినిమా ఏమి చేతిలో లేకుండా ఖాళీగా వున్నాడు. కారణం అతను ఒప్పుకునే సినిమాలకి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చెయ్యడమేనంట. రవితేజ ఏకం గా ఒక్కో సినిమాకి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. అసలే ప్లాప్ లో వున్న ఈయనకి అంత పెద్దమొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారట. 'బెంగాల్ టైగర్' కి ముందు రవితేజ వరుస ప్లాప్ లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దమ్మున్న సినిమాగా 'బెంగాల్ టైగర్' కి పేరు పడినా కలెక్షన్ ల విషయంలో ఆ దమ్ము కనపడలేదు. మరి ఇలాంటప్పుడు రవితేజ భారీగా డిమాండ్ చేస్తే అంత భరించడానికి నిర్మాతలు సిద్ధపడాలిగా అంటున్నారు. అయితే రవితేజ 'కిక్ 2' సినిమా కోసం 6 ప్యాక్ ట్రై చేసి ఉన్న అందాన్ని పోగొట్టుకున్న విషయం తెలిసిందే. బెంగాల్ టైగర్ లో కూడా అదే లుక్ తో కనబడి అభిమానులను నిరాశపరిచిన రవితేజ.. ఇప్పుడు తన లుక్ మీద దృష్టి పెట్టి ఫారిన్ వెళ్లి మేకోవర్ కోసం ట్రై చేస్తున్నాడని సమాచారం. ప్రేక్షకులు కూడా మునుపటి రవితేజను చూడాలని కోరుకుంటున్నారు. మరి మేకోవర్ తర్వాత రవితేజ కొత్త లుక్ ఎలా వుండబోతుందో..చూద్దాం!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ