అల్లు అర్జున్ - హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ఓ మూవీ త్వరలో రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. అయితే హరీష్ శంకర్ ఈ సినిమాని వీలైనంత తొందరగా ప్రారంభించి.. షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తవడం వల్ల షూటింగ్ మొదలెట్టాలని హరీష్ భావిస్తున్నాడట. అయితే ఈ సినిమాలో బన్నీకి జోడిగా హీరోయిన్స్ కోసం వెతుకుతున్నారట. ముందు పూజ హెగ్డే ని తీసుకున్నారనే వార్తలొచ్చాయి. కానీ పూజ బాలీవుడ్ లో హృతిక్ సరసన 'మోహింజదారో' సినిమాలో చేస్తుంది. ఈ సినిమా ఆగష్టు 12 న విడుదలకు సిద్ధమైంది. కానీ పూజ తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీదే పెట్టిందని టాక్. అందుకే బన్నీకి జోడిగా చెయ్యడానికి తన డేట్స్ ఖాళీ లేవని చెప్పిందని సమాచారం. ఇక 'రేసుగుర్రం' లో అల్లు అర్జున్ కి జోడి గా నటించిన శృతి హాసన్ ని అప్రోచ్ అవ్వగా ఆమె మా నాన్న సినిమా 'శభాష్ నాయుడు' షూటింగ్ లో బిజీ గా వున్నానని... కనుక కుదరదని చెప్పిందని సమాచారం. ఇక హరీష్ 'సరైనోడు' సినిమాలో బన్నీ పక్కన రెండో హీరోయిన్ గా నటించిన కేథరిన్ ని ఈ సినిమాలో కూడా రెండో హీరోయిన్ గా తీసుకున్నాడని అంటున్నారు. ఇక కేథరిన్ అయితే ఎలాగూ ఖాళీయే కాబట్టి వెంటనే దొరికేసింది. మరి హరీష్ మెయిన్ హీరోయిన్ గురించి ఇంకా ఎంతమందిని చూడాలో పాపం. ఇప్పటికే 3 హిట్స్ తో మంచి ఊపుమీదున్న బన్నీకి ఈ హీరోయిన్ కష్టాలేమిటో కదా!