Advertisementt

విజయ్..ఆ కారణం చెప్పొచ్చుగా..!!

Fri 05th Aug 2016 01:17 AM
vijay,amala paul,divorce,amala paul with vijay,vijay about amala paul  విజయ్..ఆ కారణం చెప్పొచ్చుగా..!!
విజయ్..ఆ కారణం చెప్పొచ్చుగా..!!
Advertisement
Ads by CJ

తమిళ డైరెక్టర్ విజయ్ - అమలాపాల్ డైవోర్స్ తీసుకుంటున్నారని కన్ఫర్మ్ అయ్యిపోయింది. అమల సినిమాల్లో నటించడం ఇష్టం లేకనే విజయ్, అమలతో విడిపోవాలనుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. మరో వైపు అమల మాత్రం తన అత్తా, మామలు తనని సినిమాల్లో నటించవద్దని వేధించేవారని... కానీ విజయ్ వాళ్లకి ఎంత సర్ది చెప్పినా వారు వినకుండా టార్చర్ చేసేవారని చెబుతుంది. ఇంత జరుగుతున్నా అమల భర్త విజయ్ మాత్రం నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ విషయం గురించి విజయ్ నోరు విప్పాడు. మేమిద్దరం విడిపోయామని ... అది నిజమేనని తేల్చి చెప్పాడు. కానీ మేమిద్దరం విడిపోవడానికి కారణం వేరే ఉందని.. ఇప్పుడు ప్రచారం అవుతున్న వాటిలో అసలు నిజం లేదని చెప్పుకొచ్చాడు. మేమిద్దరం 2014 లో ప్రేమించి పెళ్లిచేసుకున్నామని... ఎంతో అన్యోన్యంగా వుండేవాళ్లమని చెప్పాడు. నేను స్త్రీని గౌరవిస్తానని అలాగే అలాంటి సినిమాలే నేను చేశానని చెప్పాడు. అమల పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటే ఒప్పుకున్నానని... కానీ తను సినిమాల్లో నటించడం ఇష్టం లేక నేను ఆమెతో విడిపోతున్నానని అనడం కరెక్ట్ కాదని అంటున్నాడు. అసలు మేమిద్దరం విడిపోతామని ఎప్పుడూ అనుకోలేదని ... ఇలా జరగడం తన దురదృష్టమని అన్నాడు. ఇద్దరి మధ్య అవగాహన లోపించినప్పుడు... నమ్మకం పోయినప్పుడు ఇద్దరు కలిసి జీవించడం అర్ధం లేని తనమని అందుకే మేము విడిపోయామని చెబుతున్నాడు. లేని వార్తలు సృష్టించి రాస్తున్న వారివల్ల తీవ్ర మనోవేదనకు గురయ్యానని చెప్పాడు. ఇదంతా బాగానే వుంది..విడిపోవడానికి కారణం వేరే ఉందని చెబుతున్న విజయ్..ఎలాగూ విడిపోయారు కాబట్టి ఆ కారణమేదో చెబితే ఈ సస్పెన్స్ తొలగిపోతుంది కదా! తన మనోవేదన కూడా కాస్త దూరమవుతుంది కదా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ