Advertisementt

'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

Fri 05th Aug 2016 01:11 AM
janatha garage,audio release date,jr ntr,koratala siva  'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!
'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం 'జనతా గ్యారేజ్'. ఎన్టీఆర్ సరసన సమాంత, నిత్యామీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈ నెల 12న ఎంతో వైభవంగా శిల్పకళా వేదిక లో నిర్వహిస్తున్నాం.. అని చిత్ర బృందం తెలిపింది. 

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్ర ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయటం జరుగుతుంది. 

దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ..ఈ చిత్రానికి అభిమానుల నుండి వస్తోన్న సపోర్ట్ మా టీం కి చాలా ఆనందాన్ని ఇస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం.. అని తెలిపారు. 

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ..మా బ్యానర్ లో రెండవ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నాం. ఆగస్టు 12న హైదరాబాద్  శిల్పకళా వేదిక పై ఈ చిత్ర ఆడియోను విడుదల చేస్తున్నాం. భారీ తారాగణంతో, మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు... అని తెలిపారు.  

సాయి కుమార్, ఉన్ని ముకుందన్, అజయ్, బ్రహ్మాజీ, బెనర్జీ , జాన్ ,సితార, దేవయాని వంటి ప్రఖ్యాత నటులు ఈ చిత్రం లో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: తిరు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్ : ఎ.ఎస్. ప్రకాష్,  ఫైట్స్: ఆణల్ అరసు,  సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి,  నిర్మాతలు - నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C. V. M.), రచన  - దర్శకత్వం:  కొరటాల శివ. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ