Advertisementt

బిజెపికి బాలకృష్ణ వార్నింగ్..!

Thu 04th Aug 2016 09:16 PM
bjp,balakrishna,special category status,andhra pradesh,warning  బిజెపికి బాలకృష్ణ వార్నింగ్..!
బిజెపికి బాలకృష్ణ వార్నింగ్..!
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసనల నేపధ్యం లో అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి సహాయం చేస్తుందని.... ఈ నిరసనలు ఆపాలని విజ్ఞప్తి చేశాడు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని... ఇవ్వాల్సిన నిధులు ఇస్తామని చెబుతున్నారు. ఐతే ఏపీ ఎమ్యెల్యేలు మాత్రం ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. వీరిలో హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ కూడా వున్నారు. ఆయన ఏపీకి ప్రత్యేక హోదా విషయం లో ఘాటుగా స్పందించారు.  మనం ప్రత్యేక హోదా కోసం ఎవ్వరిని బ్రతిమాడాల్సిన పని లేదని అన్నారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని అన్నారు. అయన సచివాలయం లో మంత్రి అచ్చెన్నాయుడితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం లో ఉన్న బిజెపి ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఏపీ కి.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలని.... ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ