సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే అదో సంచలనమే. రజినీకాంత్ సినిమా మొదలైనప్పటినుండి అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. అని రజినీ అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తూ ఉంటాడు. రజినీకాంత్ గతం కొన్ని సినిమాలు ఘోరమైన పరాజయాన్ని పొందాయి. అయినా రజినీకాంత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా పెరిగిందనే చెప్పాలి. అయితే రజినీకాంత్ తన సినిమాలు ప్లాప్ అయినప్పుడు తన రెమ్యూనరేషన్ నుండి కొంత మొత్తాన్ని డిస్ట్రుబ్యూటర్స్ కి ఇచ్చేస్తాడు. అందుకే రజినీకాంత్ అంటే అందరికి ఎనలేని గౌరవం. ఇక రజినీకాంత్ 'కబాలి' సినిమా తాజాగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ 'కబాలి' సినిమాని కలై పులి థాను 110 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా 250 కోట్లు పైగా కొల్లగొట్టిందని టాక్. అయితే 'కబాలి' సినిమాకి రజినీకాంత్ 45 కోట్ల పారితోషికం తీసుకున్నాడని టాక్ నడుస్తుంది. అయితే 'కబాలి' సినిమా సూపర్ కలెక్షన్ల షేర్ లో రజిని కూడా భాగస్వామ్యుడయ్యాడని.... ఈ వచ్చిన మొత్తం లో రజినీకి ఏకంగా 40 కోట్ల షేర్ ఇచ్చారని సమాచారం. అయితే అతని రెమ్యునరేషన్ + షేర్ మొత్తం కలిపి 85 కోట్లు రజినీ కి ముట్టాయని టాక్. అసలు ఇంత భారీ మొత్తం లో రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి భారతీయ నటుడిగా వార్తల్లోకెక్కారు రజినీకాంత్.