టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పెళ్లి హైదరాబాద్ కి చెందిన డాక్టర్ రమ్యతో నిశ్చయమైన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఆగష్టు 7న గోల్కొండ రిసార్ట్స్ లో జరగనుంది. ఈ పెళ్లికి క్రిష్ వేయించిన శుభలేఖలు అందరిని ఆకర్షించాయి. అయితే ఈ పెళ్ళికి అతిరథ మహారధులు హాజరవుతున్నారని సమాచారం. తన పెళ్ళికి రావాల్సిందిగా క్రిష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రత్యేకం గా ఆహ్వానించాడని సమాచారం. 'కంచె' సినిమాకు గాను క్రిష్ జాతీయ అవార్డును అందుకున్న నేపథ్యం లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రిష్ ని ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ 100 వ చిత్రానికి క్రిష్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి క్రిష్ - రమ్యల ఎంగేజ్ మెంట్ కి హాజరయ్యాడు. క్రిష్ పెళ్ళికి ఇండస్ట్రీ నుండి అతిరథ మహారధులు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే చెప్పాలి. ఇక సినిమా ఇండస్ట్రీ నుండే కాక పొలిటికల్ పార్టీలకు చెందినవారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అందుకే గోల్కొండ రిసార్ట్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.