ఏపీకి ప్రత్యేకహోదా, రాజధానికి నిధులు, ప్రత్యేక రైల్వేజోన్, పోలవరం.. ఇలా పలు అంశాలలో రాష్ట్రాన్నిఆదుకోవడం కేంద్రం ప్రభుత్వ కనీస బాధ్యత. ఇష్టమొచ్చినట్లు విడదీసి, అందులో బిల్లు ఏ రూపంలో ఉన్నా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించి ఓటింగ్‌లో కాంగ్రెస్‌కు వంత పలికిన పార్టీ బిజెపి. విభజన సమయంలో ప్రత్యేకహోదా, అందుకు కృషి చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వలేమని అంటున్నాడు. . ఏపీకి ప్రత్యేకహోదా వస్తే ప్రభుత్వ పథకాల విషయంలో 90శాతం గ్రాంట్లుగా, 10శాతం రుణంగా లభిస్తాయి. ప్రత్యేకహోదా అనే పదాన్ని పక్కనపెట్టి దానికి మించిన సాయమే ప్రత్యేకప్యాకేజీ ద్వారా ఇస్తామని కేంద్రం మాట మారుస్తోంది. అసలు విశ్వసనీయత అంటే అది వ్యక్తిత్వానికి సంబందించిన విషయం. మాట మార్చేవారు ఎక్కువకాలం మనలేరు. మోదీ విశ్వసనీయతపై కూడా ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాక్షాత్తు నాటి ప్రధాని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే రేపు మోదీ ఏ ప్రకటన చేసినా కూడా ప్రజలు నమ్మరు. నమ్మలేరు. ఏపీ విషయంలో మాటతప్పిన మోదీకి దేశప్రజల్లో విశ్వసనీయత ఉండదు. ఇప్పటికే అటు కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టు పట్టిస్తే దానికి కొనసాగింపుగా అన్నట్లు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కూడా అన్నింటా విఫలమవుతోంది. ఒక్క స్వచ్చబారత్ తప్ప మోదీ చేసింది ఇప్పటివరకు ఏమీ లేదు. నల్లదనం వెలికి తీయడం కూడా గాల్లోనే ఉంది. అదే జరిగితే రాబోయే ఎన్నికల సమయానికి ప్రాంతీయపార్టీలు పలు రాష్ట్రాల్లో బలం పెంచుకుంటాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తృతీయ ఫ్రంట్‌కు పట్టం కట్టే పరిస్దితులు ఏర్పడుతున్నాయి. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసుకొని ఒక కేసీఆర్, ఒక జయలలిత, ఒక మమతాబెనర్జీలాగా రూటు మార్చి, ఎన్డీఏ నుండి బయటకు వచ్చి కేంద్రంతో పోరాటమే ఏపీలో టిడిపికి మిగిలివున్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం.