'బాహుబలి-ది బిగినింగ్' చిత్రం దేశవ్యాప్తంగా విడుదలై టాలీవుడ్‌లో ఓ వండర్‌గా పేరు తెచ్చుకుని ఇండియా, ఓవర్‌సీస్‌లో దాదాపు రూ.650కోట్లు వసూలు చేసింది. దీంతో ఎంతో సంతోషపడ్డ రాజమౌళి విదేశాల నుంచి నిపుణులను రప్పించి, ఈ సినిమాను ఎడిట్ చేయించి యూరప్‌దేశాల్లో డబ్బింగ్ చేసి వదిలారు. కానీ ఈ చిత్రం యూరప్‌దేశాలలోని సినీ అభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇటీవల ఈ చిత్రాన్ని చైనాలో అత్యధిక ధియేటర్లలో విడుదల చేసి, ఈ యూనిట్ అక్కడ కూడా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. ఇంతకు ముందు అమీర్‌ఖాన్ నటించిన 'పీకే' చిత్రం చైనాలో 19మిలియన్ డాలర్లు వసూలు చేసింది. సో... పీకే టార్గెట్‌గా చైనాలో ఈ చిత్రం విడుదలైన రోజునే.. అక్కడ జాకీచాన్. జెట్‌లీలు నటించిన చిత్రాలు విడుదలై అద్బుతవిజయం సాధించాయి. దీంతో 'బాహుబలి' చిత్రం థియేటర్లు అక్కడ బోసిపోయాయి. ఈ చిత్రం చైనాలో 1మిలియన్ డాలర్లకే పరిమితమయింది. ఇలాంటి నేపధ్యం, గ్రాఫిక్స్ ఉండే చిత్రాలు మనకి కొత్తేమో గానీ, చైనాలో దీనిని మించిన చిత్రాలు వస్త్తుంటాయి. ఆ రకంగా 'బాహుబలి' చిత్రం విదేశాలలో ఫ్లాప్ అయిందనే చెప్పాలి. దీంతో ఈ పరాజయ ప్రభావం తాను తీస్తున్న'బాహుబలి- ది కన్‌క్లూజన్' చిత్రంపై పడుతుందని, విదేశాల్లో 'బాహుబలి2'కి పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఈ విషయం తెలిసిన రాజమౌళి అండ్ టీమ్ కూడా 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రంపై టెన్షన్ పడుతోందని సమాచారం.