Advertisementt

మహేష్‌ కోసం కష్టమైనా.. ఇష్టపడుతుంది..!

Thu 04th Aug 2016 12:25 AM
mahesh babu,namratha sirodkar,murugadoss,namratha in mahesh babu movie  మహేష్‌ కోసం కష్టమైనా.. ఇష్టపడుతుంది..!
మహేష్‌ కోసం కష్టమైనా.. ఇష్టపడుతుంది..!
Advertisement
Ads by CJ

మహేష్‌, నమ్రతా కలిసి గతంలో 'వంశీ' అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఫ్లాప్‌ అయినప్పటికీ మహేష్‌, నమ్రతల ప్రేమాయణానికి ఈ సినిమా ఉపయోగపడింది. ఆ తర్వాత వీరిద్దరు వివాహం చేసుకొని ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నమ్రత నటనను దూరంగా పెట్టి ఇంటిపనులు, పిల్లలు, మహేష్‌ చిత్రాల విషయంలో సలహాలు వంటి వాటితో తెరవెనుకగానే ఉండిపోయింది. కాగా ప్రస్తుతం మహేష్‌, మురుగదాస్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో మహేష్‌ పోషించినున్న పాత్రకు జోడీగా నమ్రత.. మహేష్‌తో మరలా జతకట్టనుంది. కేవలం కొద్ది నిమిషాల గెస్ట్‌రోల్‌ అయినా ఈ పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉంటోందని సమాచారం. నమ్రత ఒప్పుకుంటే.. ఆమె నటించడానికి నాకేమీ అభ్యంతరం లేదని మహేష్‌ చెప్పటం, చేస్తున్నది తన భర్తతోనే కాబట్టి నమ్రత కూడా ఆ పాత్రకు ఓకే చెప్పిందని తెలుస్తుంది. కానీ పెళ్లయిన తర్వాత మహేష్‌ అందం మరింతగా పెరుగుతుండగా, నమ్రత మాత్రం ఫిజిక్‌ విషయంలో చాలా ఇబ్బందులు పడుతోంది. దాంతో ఆమె మరలా తన పూర్వ ఫిజిక్‌ కోసం ఇప్పుడు భారీ కసరత్తులు చేస్తోందని సమాచారం. మొత్తానికి మహేష్‌తో నటించడానికి ఒప్పుకున్న తర్వాత తప్పనిసరి పరిస్దితుల్లో నమ్రత కష్టపడడానికి రెడీ అవుతోంది. మహేష్‌ పుణ్యమా అని ఇప్పుడు ఆమె మరలా తన ఫిజిక్‌పై దృష్టి పెట్టడం ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ