Advertisementt

సురేష్‌బాబు, వెంకీల మధ్య గొడవల్లేవంట!

Wed 03rd Aug 2016 08:24 PM
venkatesh,suresh babu,d ramanaidu,rumors  సురేష్‌బాబు, వెంకీల మధ్య గొడవల్లేవంట!
సురేష్‌బాబు, వెంకీల మధ్య గొడవల్లేవంట!
Advertisement
Ads by CJ

తమ తండ్రి డి.రామానాయుడు మరణానంతరం ఆయన కుమారులైన సురేష్‌బాబు, వెంకటేష్‌లు తమ ఆస్తులను పంచుకోనున్నారని, వెంకీ స్వయంగా ఓ ప్రొడక్షన్‌ సంస్దను స్దాపించనున్నాడని, అన్నదమ్ముల మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోందని మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ విషయాలను సురేష్‌బాబు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖండించాడు. తామిద్దరం మంచి స్నేహితుల్లా ఉంటామని, తమ మధ్య  ఆస్తుల పంపకం లేదని, తమ ఆస్తులను తామిద్దరం సమష్టిగానే చూసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. తామిద్దరం కలసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటామని, చిన్నప్పటి నుంచి తామిద్దరం ఒకరి మాటకు మరొకరు విలువనిస్తామన్నారు. అలాగే మేమిద్దరం పేర్లు పెట్టుకొని పిలుచుకుంటామని తెలిపాడు. వాడికి నచ్చని పని తాను చేయనని, అలాగే నాకు నచ్చని పని తాను కూడా చేయడని,.. అలాంటివి జీవితంలో జరగవని, తామెప్పుడు కలిసికట్టుగానే ఉంటామని తెలిపి, ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ