Advertisementt

తమన్నా అలా ఎలా మోసపోయింది..?

Wed 03rd Aug 2016 08:17 PM
tamanna,abhinetri movie,devil,two in one movie,kona venkat,abhinetri movie teaser talk  తమన్నా అలా ఎలా మోసపోయింది..?
తమన్నా అలా ఎలా మోసపోయింది..?
Advertisement
Ads by CJ

తమన్నా ద్విపాత్రాభినయం చేస్తూ, ప్రభుదేవా నిర్మాతగానే కాకుండా ఓ ప్రధానపాత్రను కూడా చేస్తోన్న చిత్రం 'అభినేత్రి'. తాజాగా ఈ చిత్ర టీజర్ ఒకటి విడుదలైంది. ఈ టీజర్లో తమన్నా ఇరగదీసిందనే చెప్పాలి. కాగా ఈ చిత్రానికి తెలుగులో నిర్మాతగా కోనవెంకట్‌ వ్యవహరిస్తున్నాడు.ఇక ఈ చిత్రం తమిళవెర్షన్‌కు ప్రభుదేవా నిర్మాత. తమిళ దర్శకుడు విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో 'డెవిల్‌' పేరుతో రూపొందుతోంది. ఇక హిందీ వెర్షన్‌కు ఈ చిత్రంలో కీలకపాత్ర చేస్తున్న సోనుసూద్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో 'టూ ఇన్‌ వన్‌' అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. కాగా ఈచిత్రానికి తమన్నా తీసుకున్న పారితోషికం రూ.30లక్షలే అని తెలుస్తోంది.ఈ చిత్రం అగ్రిమెంట్‌ జరిగేటప్పుడుఈ చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తమన్నాకి తెలియదని సమాచారం. కేవలం ఒకేభాషలో ఈచిత్రాన్ని రిలీజ్‌ చేస్తారని, అది తమిళంలో అని, ఈ సినిమా హిట్టయితేనే తెలుగులో రిలీజ్‌ చేస్తారు తప్ప ఒకేసారి మూడుభాషల్లో విడుదల చేస్తారనే విషయం ముందుగా తమన్నాకి తెలియదంటున్నారు. అందుకే ఆమె కేవలం రూ.30లక్షలకే ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని అంటున్నారు. పారితోషకం విషయాన్ని పక్కనపెడితే ఈ చిత్రం మూడుభాషల్లోనూ హిట్టయితే అది తమన్నా కెరీర్‌కు మంచి బూస్టప్‌ అవుతుందనడంలో సందేహం లేదు. 

Click Here to see the Abhinethri Tamanna 1st Look Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ