విలక్షణమైన సినిమాలు తీసే దర్శకుల్లో తమిళ దర్శకుడు బాల పేరు మొదటగా వినబడుతుంది. ఆయన ఎలాంటి సినిమా తీసినా కూడా అది దేశ వ్యాప్తం గా చర్చించుకుంటారు. డైరెక్టర్ బాల సినిమాల్లో చేసే నటీ నటులు నటించరు.. వాళ్ళ వాళ్ళ పాత్రల్లో జీవిస్తారు అలా తీర్చి దిద్దుతాడు వాళ్ళ పాత్రల్ని. ఎంతటి స్టార్ హీరో అయినా సరే అతనిలో అసలు సిసలు నటుణ్ని బయటికి తీసుకొస్తాడనే పేరు తెచ్చుకున్నాడు ఈ డైరెక్టర్. ఎంతటి వారికైనా బాల సినిమాలో ఒక్కసారి నటిస్తే తమ జన్మ ధన్యమంటారు. అలాంటి దర్శకుడి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో నటిస్తున్నాడని విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఛాన్స్ ఎన్టీఆర్ కి ఎలా వచ్చిందంటే... ఎన్టీఆర్ - మోహన్ లాల్ కలిసి 'జనతా గ్యారేజ్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ మధ్య మోహన్ లాల్ ఒక సందర్భంలో దర్శకుడు బాలని కలిసాడని.... అక్కడే తానూ చేస్తున్న 'జనతా గ్యారేజ్' షూటింగ్ కబుర్లు మరియు ఎన్టీఆర్ గురించి బాలతో ముచ్చడించాడని టాక్. మోహన్ లాల్ ఎన్టీఆర్ గురించి గొప్పగా బాల దగ్గర చెబుతుంటే... బాలకి మాత్రం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తే బావుంటుందని ఆలోచన వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే తన దగ్గర ఒక కథ ఉందని అది ఎన్టీఆర్ తో చేస్తే బావుంటుందని అనుకుని బాల ఫిక్స్ అయ్యాడని వార్తలొస్తున్నాయి. మరి బాలతో చేయడానికి చాల మంది హీరోలు వేయికళ్లతో ఎదురు చూస్తూ వుంటారు.. ఆ లక్కీ ఛాన్స్ ఎన్టీఆర్ కి తగలడం అదృష్టమే కదా. మరి బాలతో సినిమా చెయ్యాలి అంటే చాల ఓపిక, సహనం అవసరం. మరి ఎన్టీఆర్ దీనికి సిద్ధమైతేనే వీరిద్దరి కాంబినేషన్ సినిమా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ షూటింగ్ లో బిజీ గా ఉండడం వలన బాలను కలవలేక పోయాడని.. ఈ సినిమా విడుదలయ్యాక బాలతో స్టోరీ డిస్కషన్ జరుగుతుందని.... స్టోరీ నచ్చితే గనుక బాలతో సినిమాకి ఎన్టీఆర్ కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉందని సమాచారం. ఇప్పటికే బాల తీసిన సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ గనక బాలతో సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటే అది ఒక సంచలనమే అవుతుంది.