ఏదైనా ఫంక్షన్‌కు దాసరి వచ్చాడంటే చాలు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి హాట్‌టాపిక్‌ను క్రియేట్ చేస్తాడు. తాజాగా ఆయన 'పెళ్లిచూపులు' థాంక్స్ మీట్‌కు వచ్చి రీమేక్ సినిమాలపై మోజు వద్దని అన్నాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లో రీమేక్‌లు చేస్తోంది చిరు, పవన్, చరణ్, వెంకీ. చిరు ప్రస్తుతం 'కత్తి' రీమేక్‌లో నటిస్తున్నాడు. పవన్ గతంలో చాలా రీమేక్‌లు చేసి ఉన్నాడు. ఇటీవలి కాలంలో కూడా 'గబ్బర్‌సింగ్, గోపాల గోపాల' చిత్రాలు కూడా రీమేక్‌లే. త్వరలో పవన్ తమిళ నిర్మాత ఎ.యం.రత్నంకు 'వేదాళం' రీమేక్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇక రామ్‌చరణ్ తాజాగా తమిళ 'తని ఒరువన్' రీమేక్ చేస్తున్నాడు. ఇక వెంకటేష్‌ను రీమేక్‌కింగ్‌గా చెప్పవచ్చు. త్వరలో ఆయన బాలీవుడ్ మూవీ 'సాలా ఖద్దూస్'ను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. మొత్తానికి దాసరి వ్యాఖ్యలు వీరికి తగిలినట్టు ఉన్నాయి అని కొందరు అంటుంటే కొందరు మాత్రం..దాసరి కాకతాళీయంగానే ఆ మాటలు చెప్పాడని, దానికి గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకొంటున్నారని అంటున్నారు. అయినా దాసరి కూడా రీమేక్‌లకేం అతీతుడు కాదు. ఇటీవల చేసిన 'ఎర్రబస్సు' చిత్రం కూడా తమిళ రీమేకే కదా! అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.