టాలీవుడ్‌లో కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలన్నా, పెద్దగా అనుభవం లేని దర్శకులకు అవకాశాలు ఇవ్వాలన్నా.. అది సీనియర్‌స్టార్ నాగార్జునకే ఆ తెగువ ఉంది. టాలెంట్ ఉంటే ఏ దర్శకుడితో చేయడానికైనా ఆయన ముందుంటాడు. కాగా మరో సీనియర్ స్టార్ వెంకటేష్ మాత్రం తన కెరీర్ పీక్‌స్టేజీలో ఉన్నప్పుడు కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి పెద్దగా ఉత్సాహం చూపించేవాడు కాదు. కానీ ఈ మధ్య మాత్రం వెంకటేష్ యూత్‌కు, కొత్తవారికి బాగా అవకాశాలు ఇస్తున్నాడు. 'బాడీగార్డ్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం, గోపాలా గోపాల' చిత్రాలతో పాటు ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చేస్తున్నాడు. ఇక ఆయన తన తదుపరి చిత్రాలుగా బాలీవుడ్ 'సాలాఖుద్దూస్'కు తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. హిందీలో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సుధా కొంగరనే తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించనుంది. దీని తర్వాత 'నేను..శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్నాడని సమాచారం. మొత్తానికి ఇప్పుడు వెంకీ యువతకు ప్రాధాన్యతను ఇస్తూ.. తనవంతుగా ఇండస్ట్రీకి యువతని అందించే బాధ్యత తీసుకున్నట్లుగా తెలుస్తుంది.