Advertisementt

రష్మీ, అనసూయలతో పోటీ కి వస్తుంది..!

Tue 02nd Aug 2016 12:42 PM
  రష్మీ, అనసూయలతో పోటీ కి వస్తుంది..!
రష్మీ, అనసూయలతో పోటీ కి వస్తుంది..!
Advertisement
Ads by CJ

యాంకర్స్ గా బుల్లితెరను ఏలేస్తూ అటు నుంచి అటే వెండితెరను ఏలడానికి సిద్హమైపోతున్నారు టాలీవుడ్ యాంకర్స్. వీరిలో రష్మీ, అనసూయ ముందు వరసలో వున్నారు. రష్మీ అయితే ఏకంగా తన అందాలను ఆరబోస్తూ సినిమాల్లో హీరోయిన్ గా సెటిల్ అయిపోతుంటే....  పద్దతిగా కేరెక్టర్లు చేసే అనసూయ కూడా ఇప్పుడు రెచ్చిపోయి హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేసి కుర్ర కారును రెచ్చగొడుతూ సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తుంది. వీళ్ళిద్దరేనా చేసేది నేనేమన్నా తక్కువ తిన్నానా అని ఈ మధ్యనే యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ కోసం రెడీ అవుతుంది. కొన్ని సినిమాల్లో చిన్న చితక కేరెక్టర్స్ చేసుకుంటూ పద్దతిగా యాంకరింగ్ చేసుకుంటున్న శ్రీముఖికి కూడా హీరోయిన్ అవ్వాలనే కోరిక కలిగినట్లుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య అడల్ట్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తుందనేది తెలిసిన విషయమే. ఇలాంటి కథలతో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన బాలీవుడ్ మూవీ 'హంటర్' సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని డైరెక్టర్ నవీన్ అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఒక కేరెక్టర్ ని శ్రీనివాస్ అవసరాల చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఇంకా రెజీనా ఈ సినిమాలో మెయిన్ హీరొయిన్ గా నటిస్తుండగా... మరో కీలకపాత్రలో యాంకర్ శ్రీముఖి నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ 'హంటర్' సినిమాని తానూ చూడకపోయినా డైరెక్టర్ చెప్పిన నేరేషన్ నచ్చడం తో ఈ సినిమా ఒప్పుకున్నానని... చెప్పుకొచ్చింది శ్రీముఖి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ