Advertisementt

చిరుని వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారు?

Tue 02nd Aug 2016 12:31 PM
chiranjeevi,150th movie,bollywood heroines,katrina kaif,kareena kapoor,sonakshi sinha,reject  చిరుని వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారు?
చిరుని వాళ్ళు ఎందుకు వద్దనుకున్నారు?
Advertisement
Ads by CJ

చిరు 150 వ సినిమా కోసం చాలా మంది హీరోయిన్స్ ని చూసి చివరికి ఖాళీగా వున్న కాజల్ ని సెలెక్ట్ చేశారని అనుకుంటున్నారు అందరు. కానీ చిరంజీవి కోసం బాలీవుడ్ హీరోయిన్స్ ని చాలా మందిని అడిగారని ఎవరు కూడా పక్కన నటించేందుకు ఒప్పుకోలేదని.. ఇప్పుడు ఇండస్ట్రీ లో టాక్. చిరు 150 వ సినిమాలో చిరు పక్కన నటించేందుకు మొదటగా కత్రినాని అడిగారని కత్రినా నేను ఇప్పుడు తెలుగు మూవీస్ లో నటించడం లేదని చెప్పిందట. ఇక తర్వాత కరీనా కపూర్ని అప్రోచ్ అవగా ఆమె నా డైరీ లో డేట్స్ ఖాళీగా లేవని చెప్పిందట. అప్పటికే కరీనా ప్రెగ్నెంట్ మరి అందుకే తానూ ఒప్పుకోలేదేమో అలా డైరెక్ట్ గా చెప్పలేక డేట్స్ అంటూ కహాని చెప్పిందని అనుకుంటున్నారు. ఇక అక్కడినుండి సోనాక్షి అయితే చిరంజీవికి జోడి గా బావుంటుందని ఆమె దగ్గరికి వెళ్లగా ఆమె కూడా సారీ చెప్పిందని సమాచారం. అసలు వీళ్ళు ఎందుకు చిరు పక్కన నటించడానికి ఇంట్రెస్ట్ చూపలేదో అది వాళ్ళకే తెలియాలి. కానీ చిరంజీవి మాత్రం బాగా హార్ట్ అయ్యాడని అంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ అసలు తనతో ఎందుకు నటించానన్నారో  అర్ధం కాక తలపట్టుకున్నాడట. అవన్నీ ఎందుకులే... హీరోయిన్ గా కాజల్ ని ఫైనల్ చేశారు కాబట్టి ఇక ఇవన్నీ ఆలోచించడం అనవసరం కదా అనుకుంటున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ