ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నరేంద్ర మోడీ ఏ విధంగా సుముఖంగా లేరు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వక పొతే బిజెపి నుండి విడిపోవాలని చంద్రబాబు అనుకుంటున్నారని సమాచారం. 2014 ఎన్నికల్లో టిడిపి - బిజెపి మిత్ర పక్షాలుగా పవన్ ఆధ్వర్యంలో గెలిచి టిడిపి అధికారాన్ని చేపట్టింది. మరి అప్పటినుండి స్పెషల్ స్టేటస్ గురించి చంద్రబాబు సీరియస్ గా ఆలోచించలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన బిల్లుతో తెలుగు దేశానికి ఏం చేయాలో తెలియక ప్రత్యేక హోదాపై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాపం చంద్రబాబు అటు ఏమన్నా అంటే మిత్ర పక్షం బిజెపికి మండుతుంది. ఇటు కామ్ గా ఉందామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు చేతకాని వాడిలా మిగిలి పోతానని.... ఇక ఏదైతే అదే అవుతుంది అని బిజెపితో తెగ తెంపులు చేసుకోవడానికే సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మనల్ని ఇబ్బందులు పెడుతుందని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మరీ చంద్రబాబు బిజెపి ప్రభుత్వాన్ని తిడుతున్నారు. మరి ఈ జరిగే పరిణామాల వల్ల వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకుంటారో లేక అన్ని పరిస్థితులు చక్కబెట్టి పూర్వం లాగే మిత్ర పక్షాలుగా కొనసాగుతారో చూద్దాం.