Advertisementt

కాజల్ అడిగినంత..ఇచ్చేస్తున్నారా..!

Mon 01st Aug 2016 06:06 PM
chiranjeevi,kajal agaral,150th movie,ram charan,vv vinayak,remuneration  కాజల్ అడిగినంత..ఇచ్చేస్తున్నారా..!
కాజల్ అడిగినంత..ఇచ్చేస్తున్నారా..!
Advertisement
Ads by CJ

చిరంజీవి 150 వ సినిమా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా అనేకమందిని పరిశీలించారు. ముందుగా చిరంజీవి పక్కన అనుష్క అయితే బావుంటుందని అనుకున్నారు అంతా. కానీ అనుష్క బాహుబలి 2, సింగం 3  సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాలో చేయలేనని చెప్పడం తో మరో హీరోయిన్ ని వెతికే వేటలో చిత్ర యూనిట్ పడిందని... ఆ క్రమం లో బాలీవుడ్ హీరోయిన్స్ జాక్విలిన్ ను మరియు నర్గిస్ ఫక్రి ని కూడా  సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. కానీ అవేమి కాకుండా టాలీవుడ్ లో ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న కాజల్ ని సంప్రదించారని.. దానికి కాజల్ చిరు 150 వ సినిమాలో నటించాలంటే  2.5 కోట్లు డిమాండ్ చేసిందనే వార్త కూడా ప్రచారం లోకి వచ్చింది. అయితే అంత భారీ మొత్తాన్ని ఇవ్వడానికి రామ్ చరణ్ ఆలోచించాడని అందుకే కాజల్ని ఫైనల్ చెయ్యలేదని అనుకున్నారు.  అయితే ఎట్టకేలకు చిరు 150 వ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని ఫైనల్ చేశారు. మరి అప్పుడేమో వద్దనుకుని మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారంటే... కాజల్ కి ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నారా లేక తక్కువ మొత్తం తీసుకోవడానికి ఒప్పించారా అనేది మాత్రం తెలియాల్సి వుంది. మొత్తానికి చిరంజీవికి జోడి గా కాజల్ ఫైనల్ అనేది మాత్రం ఇప్పుడు ఆఫీషియల్ న్యూస్. మరి మగధీర, నాయక్, గోవిందుడు అందరి వాడేలే సినిమాలలో రామ్ చరణ్ సరసన నటించి ఇప్పుడు చరణ్ తండ్రి చిరుతో నటిస్తుంది. దీంతో కాజల్.. తండ్రి, కొడుకులు ఇద్దరి పక్కన నటించిన హీరోయిన్ గా క్రెడిట్ కొట్టేయబోతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ