పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మెగా అభిమానులకి పిచ్చ క్రేజ్. ఏదన్నా మెగా ఈవెంట్ జరుగుతుంది అంటే అక్కడికి పవన్ వస్తాడేమో... తమ అభిమాన హీరోని చూడొచ్చు అని చాల మంది ఆశగా ఎదురు చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ కి పెద్దగా హాజరవడు. కానీ అభిమానులు మాత్రం పవన్ పై అభిమానం తో మెగా ఫ్యామిలీ ఈవెంట్ జరిగినంత సేపు అరుస్తూనే వుంటారు. అయితే ఈ కేక ల వల్ల ఫంక్షన్స్ స్పోయిల్ అవుతున్నాయని.. ఆమధ్య అల్లు అర్జున్ 'ఒక మనసు' ఆడియో వేదికపై బహిరంగంగా చెప్పాడు. అయితే 'ఒక మనసు' ఆడియోలో పవన్ గురించి అభిమానులు ఏదన్నా చెప్పమంటే 'చెప్పను బ్రదర్' అని క్లియర్ గా చెప్పేసాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెద్ద దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. అయితే శనివారం (30/07/16) జరిగిన తిక్క ఆడియో లో పవర్ స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మెగా అభిమానులు మాత్రం ఎప్పటిలాగానే పవన్, పవన్ అని అరవడం మొదలెట్టారు. దీనికి సాయి అరవండి ఇంకా గట్టిగా అరవండి అని వాళ్ళని ఎంకరేజ్ చెయ్యడమే కాకుండా నేను కూడా మీతో అరుస్తాను అని పవన్ కి జై కొట్టాడు. అంతే కాకుండా మీ ప్రేమాభిమానాలు ఎప్పటిలాగే మా పెద్ద మావయ్య చిరంజీవి గారికి మీరు చూపిస్తున్నారని.... అలాగే వారి బాటలోనే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అన్నాడు. అంతే కాకుండా పెద్ద మావయ్య వేసిన బాటలో పవన్ మావయ్య, చరణ్, బన్నీ, వరుణ్, నేను ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు నడుస్తున్నారని... మీరు మమ్మల్ని ఆదరించాలని అన్నాడు. అలాగే మీరు అరవమంటే ఎన్ని సార్లు మెగాస్టార్, పవర్ స్టార్ అని అరవడానికైనా నేను సిద్హమని చెప్పాడు. మరి 'ఒక మనసు' ఆడియోలో అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' అంటే సాయి మాత్రం 'చెప్తాను బ్రదర్' అనడం... అల్లు అర్జున్ కి కౌంటర్ వేసినట్లు వుంది కదా అనుకుంటున్నారు ఇండస్ట్రీ లో పెద్దలు. ఇక సాయి తెలివిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని కూడా తన వైపు తిప్పుకోవడానికే ఇలా మాట్లాడాడని అనుకోవడం కొసమెరుపు.