అన్ని విషయాల్లో ముక్కు సూటిగా వ్యవహరించే కృష్ణవంశీ తన ఫ్యామిలీ గురుంచి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కృష్ణ వంశీ - రమ్యకృష్ణ జంట గురించి అందరికి తెలుసు. ఆమధ్య వీరి గురుంచి అనేక రూమర్స్ వచ్చాయి. 'శ్రీ ఆంజనేయం' సినిమా వచ్చినప్పుడు రమ్యకృష్ణ కి, కృష్ణ వంశీకి గొడవలు జరిగినట్టు ప్రచారం జరిగింది. కానీ అవన్నీ అవాస్తవాలు అని కృష్ణవంశీ చెప్పారు. అయితే అయన చేస్తున్న సినిమాల గురుంచి రమ్యకృష్ణ ఎప్పుడు ఎలాంటి సలహాలు ఇవ్వరంట. అయితే మేమిద్దరము కలిసి ఎటువంటి ఫంక్షన్స్ కి అటెండ్ కామని కొందరు అనుకుంటారని... మేము చాలా ఫంక్షన్స్ కి కలిసే వెళ్లే వాళ్లమని ఎప్పుడో ఎదో ఒక ఫంక్షన్ కి ఇద్దరు వెళ్లకపోతే మా ఇద్దరికీ గొడవ వచ్చినట్లే అని కొందరు అబద్దపు ప్రచారం చేస్తారని అన్నారు. 'శ్రీ ఆంజనేయం' టైం లో రమ్యకృష్ణ డబ్బులు వాడుకున్నానని ప్రచారం జరిగిందని అదంతా అవాస్తవమని.... అలాగే నేను అస్సలు రమ్యకి సంబంధించి ఒక్క రూపాయి కూడా వాడుకోనని అలా వాడుకున్న రోజున నేను చచ్చిపోయినట్లు భావిస్తానని అన్నారు. ఆ పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు ఇంక రాదనీ అన్నారు. మేము పెళ్లి కూడా చాలా సింపుల్ గా చేసుకున్నామని అలా చెయ్యడం రమ్యకి కొంచెం కష్టం అనిపించినా తర్వాత ఒప్పుకుందని అన్నారు. మీడియాలో రూమర్స్ వచ్చినప్పుడు మాత్రం... వీరికి ఒక న్యూస్ కావలి కాబట్టి ఈ రోజు ఏమి లేవవేమో అందుకే మా మీద పడ్డారు అనుకుంటాము అని అన్నారు. రమ్యకి తెలుగు రాదు కాబట్టి ఆ విషయాలన్నీ కృష్ణవంశీ గారే చదివి వినిపిస్తారట.