మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్.. సినిమా వచ్చి అప్పుడే రెండు నెలలు గడుస్తుంది. అయితే ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది తెలీదు. ఇప్పుడు త్రివిక్రమ్ ఏ హీరో తో సినిమా తీస్తాడనేది అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన త్రివిక్రమ్ తాజాగా చిన్న హీరో అయిన నితిన్ తో 'అ..ఆ' సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఏ హీరో తో సినిమా తీయాలి.. అని ఆలోచిస్తున్న త్రివిక్రమ్ కి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఆ ఆఫర్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిందని... అది బాలకృష్ణ కొడుకు కి సంబందించిన విషయమని టాక్. నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం అయ్యే మూవీ..త్రివిక్రమ్ చేతుల్లోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ.. బాలకృష్ణ 100వ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న విషయం తెలిసిందే. మరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూనే నటనలో మెళుకువలు కూడా నేర్చుకుంటున్నాడని సమాచారం. మరి మోక్షజ్ఞ తెరంగేట్రం చేసే సినిమా త్రివిక్రమ్ చేతిలో పడితే మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ కి మంచి పేరొస్తుందని బాలకృష్ణ భావిస్తున్నాడని సమాచారం. మరి ఇదే నిజమైతే మొట్టమొదటి సారి త్రివిక్రమ్ నందమూరి కాంపౌండ్ లో అడుగుపెతున్నట్లే. అసలు ఈ ఆఫర్ ని త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా అనేది కూడా సస్పెన్సే. ఏది ఏమైనా ఈ ఏడాది బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనేది మాత్రం తెలుస్తుంది.