Advertisementt

ఇక అల్లు శిరీష్‌ కోసం.. అరవింద్ ఆరాటం!

Mon 01st Aug 2016 02:24 PM
allu sirish,aravind,allu arjun,srirastu subhamastu,jagadekaveeruni katha  ఇక అల్లు శిరీష్‌ కోసం.. అరవింద్ ఆరాటం!
ఇక అల్లు శిరీష్‌ కోసం.. అరవింద్ ఆరాటం!
Advertisement
Ads by CJ

అల్లు అరవింద్‌ తనయుడు అల్లుఅర్జున్‌ను 'గంగోత్రి' సినిమా చూసిన వారు ఇతనేం హీరో అని వ్యాఖ్యానించారు. కానీ మంచి కథలను సెలక్ట్‌ చేసుకొని, మెగా కాంపౌండ్‌ పేరును వాడుకొని మొత్తానికి అల్లుఅర్జున్‌ను టాప్‌హీరో పోజిషన్‌లో నిలబెట్టడంలో ఆయన తండ్రి అల్లుఅరవింద్‌ సక్సెస్‌ అయ్యాడు. కాగా ఆయన ఇప్పుడు తన రెండో తనయుడు అల్లు శిరీష్‌ను ప్రమోట్‌ చేసి, హీరోగా నిలబెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. కాగా తన మొదటి రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో శిరీష్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో వెంటనే అలర్ట్‌ అయిన అరవింద్‌ శిరీష్‌ కోసం వైవిధ్యమైన కథలను ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. కాగా ప్రస్తుతం పరుశురామ్‌ దర్శకత్వంలో లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోన్న 'శ్రీరస్తు...శుభమస్తు' చిత్రం ఓ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం ఆగష్టు5 వ తేదీన విడుదల కానుంది. కాగా ఇప్పుడు అల్లుశిరీష్‌ నటించే తదుపరి చిత్రం కూడా ఖరారైంది. ఎం.వి.ఎస్‌.రెడ్డి దర్శకత్వంలో శైలేంద్రబాబు నిర్మాతగా శిరీష్‌ తన తదుపరి చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం ఓ పీరియాడికల్‌ డ్రామాగా రూపొందనుంది. కాగా ఈ చిత్రం కోసం 'జగదేకవీరుడి కథ' అనే ఆసక్తికర టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు కొన్నిరోజుల్లో అధికారికంగా వెల్లడించనున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ