Advertisementt

పవన్ కి ఈ పిచ్చి మాత్రం తగ్గట్లేదు!

Sun 31st Jul 2016 09:17 PM
pawan kalyan,writer,trivikram srinivas,pawan again pen the story,power star,sardaar gabbar singh,johnny  పవన్ కి ఈ పిచ్చి మాత్రం తగ్గట్లేదు!
పవన్ కి ఈ పిచ్చి మాత్రం తగ్గట్లేదు!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ లో ఒక మంచి నటుడే కాదు ఒక గొప్ప రచయిత కూడా దాగున్నాడు. ఆయన ఇదివరకెప్పుడో సొంతంగా ఒక కథ రాసుకుని... ఆ సినిమాకి డైరెక్షన్ కూడా చేసాడు. ఇక ఆ సినిమాలో హీరో కూడా పవన్ కల్యాణే. ఆ సినిమానే 'జానీ'. పవన్ కళ్యాణ్ తీసిన ఈ సినిమా పవన్ కి జీవితం లో మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. ఇక అప్పటి నుండి కథల జోలికి, డైరెక్షన్ జోలికి పోకుండా సినిమాలు మాత్రమే చేసుకుంటూ వున్నాడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత తాను సొంతగా 'సర్దార్ గబ్బర్ సింగ్' స్టోరీ ని రాసుకుని వేరే డైరెక్టర్ తో తాను హీరో గా నటించాడు. ఇక ఈ సినిమా రిజల్ట్ అందరికి తెలిసిందే. అయినా.. పవన్ తన పని తాను చేసుకోక ఈ కథల పిచ్చెమిటో అని అతని సన్నిహితులే అంటున్నారట. అయినా పవన్ తన నైజాన్ని ఏ మాత్రం మార్చుకోకుండా మళ్ళీ ఒక కథని రాస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. పవన్ రాస్తున్న ఈ కథ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి బాగా నచ్చిందట. అందుకే ఈ కథ తనకి ఇస్తే డైరెక్షన్ చేస్తానని చెప్పాడట. మరి తన కథతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ నటిస్తాడా లేక మరో హీరో తో సినిమా తీస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'జల్సా, అత్తారింటికి దారేది' సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు  ఈ స్నేహితులిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలకు వేదిక కాబోతుందో చూద్దాం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ