Advertisementt

రష్మి..'క్యాష్‌ అండ్‌ క్యారీ' రూల్..!

Sat 30th Jul 2016 07:16 PM
  రష్మి..'క్యాష్‌ అండ్‌ క్యారీ' రూల్..!
రష్మి..'క్యాష్‌ అండ్‌ క్యారీ' రూల్..!
Advertisement
Ads by CJ

'జబర్దస్త్‌' ప్రోగ్రాం.. యాంకర్లు అనసూయ, రష్మిలను బుల్లితెర హాట్‌యాంకర్లుగా తయారుచేసింది. ఇక అనసూయకు ఈ ప్రోగ్రాంలో పాపులర్‌ అయిన తర్వాత 'సోగ్గాడే చిన్నినాయనా'లో తళుక్కున మెరిసే పాత్ర వచ్చింది. ఆ తర్వాత ఆమె చేసిన 'క్షణం' చిత్రంలో ఆమెకు అందాలు ఆరబోసే అవకాశం లభించలేదు. ఈ టైమ్‌లోనే 'జబర్దస్త్‌' ద్వారా పాపులర్‌ అయిన రష్మికి సైతం సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. ఆమె బుల్లితెర మీదకు రాకముందు కూడా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు ఎలాంటి గుర్తింపురాలేదు. కానీ బుల్లితెర వీక్షకులను మాత్రం ఆమె బాగా ఆకట్టుకోవడంతో.. కొందరు చిన్ననిర్మాతలు, దర్శకుల కంట్లో ఆమె పడింది. సినిమాలలో నటించే ఓ నటి అందాల ఆరబోత చేసినా పెద్దగా పట్టించుకోరు కానీ టివిలో మనం రోజూ చూసే యాంకర్‌ అందాలను ఆరబోసింది అంటే మాత్రం ఎక్కడలేని క్రేజ్‌ వస్తుంది. ఈ విషయాన్ని బాగా గమనించిన డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తార్‌ తన 'గుంటూరు టాకీస్‌' చిత్రంలో ఆమెను తీసుకొని మస్త్‌గా ఎక్స్‌పోజింగ్‌ చేయించాడు. దాంతో ఆ చిత్రానికి వచ్చిన హైప్‌ అంతా ఇంతా కాదు. దీంతో కేవలం రష్మి అందాలను చూడటానికి ఓ వర్గం ప్రేక్షకులు క్యూ కట్టారు. ఈ చిత్రం ఆర్దికంగా ఓకే అనిపించుకోవడానికి కారణం కేవలం రష్మినే అంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన 'అంతం' చిత్రంలో ఆమెను ఉపయోగించుకోవడం డైరెక్టర్‌కు చేతకాలేదు. ఈ చిత్రం ఫ్లాప్‌ అయినా కూడా రష్మికి పలు చిన్న చిత్రాలలో అవకాశాలు జోరుగా వస్తున్నాయట. దీనికి కారణం ఆమె ఫాలో అవుతున్న విధానమే. 'నాకెంత ఇస్తారు.. మీ చిత్రంలో నేనేమైనా చేస్తాను' అనే క్యాష్‌ అండ్‌ క్యారీ విధానమే కారణమని తెలుస్తోంది. దీంతో అనసూయ కంటే రష్మికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయట. మరి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం నేటి తరం మంత్రం కావడం కూడా ఓ కారణమే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ