Advertisementt

సుధీర్‌బాబుతోనేనా రాజశేఖర్ చేస్తుంది?

Sat 30th Jul 2016 07:13 PM
rajasekhar,sudheer babu,villain role,bhalemanchi roju movie,bhagi movie  సుధీర్‌బాబుతోనేనా రాజశేఖర్ చేస్తుంది?
సుధీర్‌బాబుతోనేనా రాజశేఖర్ చేస్తుంది?
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు బావమరిది సుధీర్‌బాబు 'భలే మంచిరోజు' తర్వాత తెలుగులో లాంగ్‌గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ మధ్యలో బాలీవుడ్‌లో 'బాఘి' చిత్రంలో విలన్‌ పాత్ర చేశాడు.ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినప్పటికీ సుధీర్‌బాబు నటనకు మంచి గుర్తింపే లభించింది. కాగా తెలుగులో ఆయన త్వరలో బాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవితాన్ని సంబంధించిన ఓ బయోపిక్‌ మూవీలో నటించనున్నాడని తెలిసిందే. కాగా ఈచిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌లో టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌సత్తార్‌ తలమునకలై ఉన్నాడని సమాచారం. ఈ చిత్రం ప్రీప్రొడక్షన్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.... చిత్రంపై కొద్దిరోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా ప్రవీణ్‌సత్తార్‌ డైరెక్షన్‌లో త్వరలో రాజశేఖర్‌ పోలీస్‌ పాత్రను పోషిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రం సుధీర్‌బాబు హీరోగా చేసే చిత్రమేనని, రాజశేఖర్‌ విలన్‌ ఛాయలు ఉన్న ఓ పోలీస్‌ పాత్రను చేయనున్నాడని కొందరు అంటుంటే. కాదు.. రాజశేఖర్‌తో ప్రవీణ్‌సత్తార్‌ తీయబోయే చిత్రం మరో చిత్రమని కొందరు అంటున్నారు. మొత్తానికి సుధీర్‌బాబుతో ప్రవీణ్‌సత్తార్‌ చిత్రం మాత్రం ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో నిర్మితంకానుందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ