Advertisementt

ప్రో కబడ్డీ లోనూ పవన్ క్రేజ్!

Sat 30th Jul 2016 05:47 PM
pawan kalyan,pro kabaddi,telugu titans,semi finals,pro kabaddi season 4  ప్రో కబడ్డీ లోనూ పవన్ క్రేజ్!
ప్రో కబడ్డీ లోనూ పవన్ క్రేజ్!
Advertisement
Ads by CJ

ఎంత పెద్ద అవార్డు వచ్చిన దానిని అందుకోవడానికి మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్ళడు. ఎందుకో అలాంటి ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ అటెండ్ కాడు. అతనికి ఆడంబరంగా జీవించడం అసలు ఇష్టం ఉండదు. సింపుల్ గా ఉండడానికే ఎక్కువగా ఇష్ట పడతాడు. సినిమా ఆడియో ఫంక్షన్ లకు తప్ప మరే ఇతర  ప్రవేట్ ఫంక్షన్లకి అటెండ్ కానీ పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరుచూ ఏదో ఒక ఫంక్షన్ కి అటెండ్ అవుతూ వార్తల్లో ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ లో ఎందుకింత మార్పు వచ్చిందో తెలీదుకానీ అయన మాత్రం కొన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ అభిమానులకు షాక్ ఇస్తున్నాడు. ఆ మధ్య లండన్ లో జరిగిన ఒక కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. ఈ షాక్ నుండి తేరుకునే లోపు నిన్న గాక మొన్న( బుధవారం) జరిగిన మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ కి అటెండ్ అయ్యాడు. ఆ.. ఏదో దేవిశ్రీ మీద అభిమానం కొద్దీ అతనికి అవార్డు అందచెయ్యడానికి వచ్చాడులే అని కొందరు సరిపెట్టుకున్నారు.

అయితే ఇది ఇంకా మరవకముందే ఇప్పుడు మరోసారి పవన్ ప్రో కబడ్డీ లో ఈ రోజు (శుక్రవారం) హైదరాబాద్ లో జరిగే సెమి ఫైనల్స్ మ్యాచ్ ని తిలకించడానికి వెళుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లు ఎంత గా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. అయితే ప్రో కబడ్డీ 4 వ సీజన్ లో సెమిస్ లో తెలుగు టైటాన్స్ జట్టు.. అభిషేక్ బచ్చన్ స్పాన్సర్ చేసిన జైపూర్ పింక్ పెంతర్స్ జట్టుతో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు టైటాన్స్ జట్టుకు బూస్ట్ ఇవ్వాల్సిందిగా ఆ జట్టు నిర్వాహకులు పవన్ ని కోరారట. అందుకే పవన్ ఈ మ్యాచ్ చూస్తూ తెలుగు టైటాన్స్ ని ఉత్సాహపరిచేందుకు వెళుతున్నాడని సమాచారం. అయితే తెలుగు టైటాన్స్ మరియు  జైపూర్ పింక్ పెంతర్స్ మ్యాచ్ చూసేందుకు జైపూర్ జట్టు స్పాన్సర్ అభిషేక్ బచ్చన్ తన ఫ్యామిలీతో వస్తున్నాడని సమాచారం. ఇక ఇంతమంది సెలబ్రిటీస్ అందునా పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ అవుతున్నాడు కాబట్టి మ్యాచ్ టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయని సమాచారం. చాలామంది టికెట్స్ దొరక్క నిరాశకులోనైనట్లుగా తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ