వంశీపైడిపల్లి తన కెరీర్‌లో ఇప్పటివరకు మంచి హిట్స్‌నే ఇచ్చాడు. పెద్దహీరోల చిత్రాలను కూడా బాగా హ్యాండిల్ చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన తాజాగా నాగార్జున, కార్తిలు నటించిన పివిపి వారి భారీబడ్జెట్ చిత్రం 'ఊపిరి' ద్వారా బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత పివిపివాళ్ల కోసమే మహేష్‌బాబుకు ఓ లైన్ వినిపించి గ్రీన్‌సిగ్నల్ పొందాడు. కానీ మహేష్‌బాబు ఉన్న బిజీ కమిట్‌మెంట్స్ వల్ల ఆ చిత్రం ఎప్పుడు ప్రారంభమయ్యేది కూడా ఎవ్వరు చెప్పలేని పరిస్ధితి. ఈమధ్య అక్కినేని అఖిల్ రెండో చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తాడన వార్తలు వచ్చాయి. కానీ అఖిల్ హను రాఘవపూడితో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఏ స్టార్‌హీరోని తీసుకున్నా అందరూ పలు వరుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. దాంతో ఏమిచేయలో వంశీపైడిసల్లికి అర్దం కావడంలేదు. అలాగని చిన్న హీరోలను, మీడియం రేంజ్‌తో సర్దుకుపోయే మనస్తత్వం కాదు అయనది. దాంతో హిట్ ఉన్నా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.