యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న జనతాగ్యారేజ్‌లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీపై మోహన్‌లాల్ హ్యాపీగా లేడని తెలుస్తుంది. దీనికి కారణం కొరటాల శివ అని తెలుస్తుంది. విషయంలోకి వస్తే..ప్రస్తుతం మోహన్‌లాల్ తెలుగులో 'మనమంతా', 'జనతాగ్యారేజ్' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోని తన పాత్ర అద్భుతంగా ఉండటంతో..తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలని కష్టమైనా సరే.. తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేశాడు. తన కష్టాన్ని గుర్తించిన చంద్రశేఖర్ యేలేటి 'మనమంతా'లో మోహన్‌లాల్ చేతే డబ్బింగ్ చెప్పించాడు. ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ట్రైలర్ ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనతాగ్యారేజ్‌లో మోహన్‌లాల్‌తో డబ్బింగ్ చెప్పించడానికి కొరటాల శివ ఒప్పుకోవడం లేదంట. అతని వాయిస్ కోసం ప్రత్యేకంగా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని పెట్టి డబ్బింగ్ చెప్పిస్తున్నాడంట. దీంతో ఈ రెండు చిత్రాల్లో డబ్బింగ్ చెప్పాలని ఎంతో ఆశపడ్డ మోహన్‌లాల్..మనమంతా విషయంలో హ్యాపీగా ఉన్నా.. జనతాగ్యారేజ్ విషయంలో మాత్రం సంతోషంగా లేడని అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో కొరటాల శివ తీసుకున్న నిర్ణయం కరెక్టో..కాదో తెలియాలంటే..ఆగస్ట్ 5న మనమంతా, సెప్టెంబర్ 2 జనతాగ్యారేజ్ చిత్రాలు విడుదల అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.