Advertisementt

అసలు అనసూయ ఎందుకిలా రెచ్చిపోతుంది?

Fri 29th Jul 2016 02:12 PM
anasuya,jabardasth,photoshoots,anasuya glamour show,movie chances  అసలు అనసూయ ఎందుకిలా రెచ్చిపోతుంది?
అసలు అనసూయ ఎందుకిలా రెచ్చిపోతుంది?
Advertisement
Ads by CJ

ఈ టీవీలో జబర్దస్త్ తో ఒక ఊపు ఊపిన అనసూయ ఆ తర్వాత ఆడియో ఫంక్షన్స్ కి యాంకరింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇక మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు అమ్మడు. అయితే ఈ మధ్య అనసూయకి బుల్లితెర మీద నుండి వెండితెర మీదకు బాగా గాలి మళ్లినట్టుంది.  తన అందం తో అభినయం తో చూపరులను ఇట్టే ఆకర్షించే శక్తి అనసూయలో కొంచెం ఎక్కువ శాతమే ఉంది. ఇద్దరు పిల్లలకి తల్లైనా కూడా ఆమె అందం లో ఏమార్పూ రాలేదు.. సరికదా రోజు రోజుకు తన అందాన్ని రెట్టింపు చేసుకుంటుంది. నాకు హీరోయిన్ అవ్వాలని లేదు కానీ.. మంచి కేరెక్టర్ వస్తే సినిమాల్లో నటిస్తాని అని ఓపెన్ గానే చెప్పింది అనసూయ. అలా అన్న అనసూయకు వెండితెర నుండి కూడా బాగానే అవకాశాలు వచ్చాయి. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో తళుక్కున మెరిసినా... ఆ తర్వాత వచ్చిన 'క్షణం' సినిమా ఆమెకు మంచి పేరు సంపాదించి పెట్టింది. కానీ  ఆ పాత్రలో ఆమెకు గ్లామర్ ప్రదర్శనకు చోటు లేకపోయింది. అయితే అనుకున్నట్టుగా అనసూయకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ తన ఫ్రెండ్ రష్మీ మాత్రం కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా తన టేలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ... అవసరానికి మించి తన అందాలను ఆరబోస్తూ సినిమా ఛాన్సులు కొట్టేసింది. కానీ అనసూయకి హీరోయిన్ ఛాన్సులు ఎలాగూ రావడం లేదు. కనీసం ఇంపార్టెంట్ రోల్స్ కూడా రాక పోయే సరికి... ఇలా సైలెంట్ గా కూర్చుంటే కుదరదనుకుని కొన్ని ఫోటో షూట్స్ తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఆ మధ్య ఏకం గా పచ్చని చెట్ల మధ్య అందాలను ఆరబోస్తూ అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలతో అందరి చూపు  తన వైపుకు తిప్పుకుంది. అది మరవక ముందే ఇప్పుడు డిఫ్రెంట్, డిఫ్రెంట్ డ్రెస్ లతో మళ్ళీ ఒక ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది అనసూయ. మరి అనసూయ అసలు ఏం ఆశించి ఈ ఫోటో షూట్స్ చేస్తుందో అని అందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఏం ఆశించడం ఏమిటి సినిమాల్లో అవకాశాల కోసమే అనసూయ ఈమార్గాన్ని ఎంచుకుంది అని మరికొందరు అనుకోవడం విశేషం.

Click Here to see the More Anasuya Glamour Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ