చిత్ర పరిశ్రమలో ఒక న్యూస్ బయటకు వచ్చింది అంటే దానికి మరిన్ని కలిపి ప్రచారం చేస్తారు. ఉదాహరణకు ఓ హీరో హిట్స్‌లో ఉన్నప్పుడు ఏదైనా వస్తువును అమ్మేస్తే, అతనికి కోట్లు వస్తున్నాయని అందుకే పాతవి అమ్మి కొత్తవి కొంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. అదే ఒక హీరో ఫ్లాప్‌లో ఉన్నప్పుడు ఏదైనా వస్తువును అమ్మివేస్తే ఆయన ఆర్దిక పరిస్థితి దారుణంగా ఉందంటూ వ్యాఖ్యలు వస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక రూమరే పవన్‌కళ్యాణ్ విషయంలో హల్‌చల్ చేస్తోంది. పవన్ నాలుగేళ్ల కిందట రెండు కోట్లు పెట్టి ఓ మెర్సిడెజ్ బెంజ్ కారును కొన్నాడు. తాజాగా ఆయన దానిని అమ్మివేశాడు. దీంతో పవన్ ఆర్దిక పరిస్థితి దారుణంగా ఉందని, అందుకే ఉన్న కారును అమ్మివేశాడని అంటున్నారు. అందులోనూ ఇటీవల పవన్ తాను ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పాడు. ఆఫీస్ రెంట్‌తో పాటు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పోజిషన్‌లో ఉన్నానని చెప్పాడు. దీంతో పవన్ డబ్బులు లేక తన కారును అమ్ముకున్నాడంటూ ప్రచారం చేస్తున్నారు. 'సర్దార్ గబ్బర్‌సింగ్' లో నిర్మాణ భాగస్వామి అయిన పవన్‌ను ఆ చిత్రం ఆర్దికంగా దెబ్బతీసిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు పవన్‌కు ఆర్ధికంగా లాభం చేకూర్చే అంశమేదీ జరగలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్ ఊ అంటే కోట్లు అతనికి ఇచ్చి సినిమాలకు అగ్రిమెంట్ చేసుకునే నిర్మాతలు క్యూలో ఉంటారు. సినిమాకు దాదాపు 20కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే పవన్... అమ్మితే కోటి రూపాయలు కూడా రాని కారును అమ్మే పరిస్థితి రావడం ఏమిటని? కొందరు వాదిస్తున్నారు. అయితే పాత కారును అమ్మివేసిన పవన్ ఇప్పటికీ కొత్త కారు కొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.