'దేనికైనా రెడీ' చిత్రంలో మోహన్‌బాబు పేరును స్క్రీన్‌పై చూపించినప్పుడు 'పద్మశ్రీ' మోహన్‌బాబు అని వేయడం, అలాగే బ్రహ్మానందం పేరుకు ముందు కూడా 'పద్మశ్రీ' వేయడంతో వారికి ఇచ్చిన పద్మశ్రీ బిరుదును కమర్షియల్‌గా, వాణిజ్య అవసరాల నిమిత్తం వాడారని కేస్ వేయడం, హైకోర్టులో మోహన్‌బాబుకు తీర్పు వ్యతిరేకంగా రావడం, చివరకు సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట లభించడం గుర్తుండే ఉంటుంది.కాగా ఈ చిత్రం ఓ వర్గం వారిని కించపరిచే విధంగా రూపొందడం, బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి ఈ పిటిషన్ వేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కాగా ఇటీవల విడుదలైన రజనీకాంత్ 'కబాలి' చిత్రంలో కూడా రజనీ పేరుకు ముందు పద్మవిభూషణ్ అని వేసిన సంగతి తెలిసిందే. కాగా మోహన్‌బాబుపై పద్మశ్రీ విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు రజనీకాంత్ మీద కూడా ఎందుకు చెలరేగలేదనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. మోహన్‌బాబు విషయానికి వస్తే ఆయన వివాదాస్పదుడు, అందుకే ఆయనంటే పడని వారు, అందులోనూ తమను కించపరిచారన్న బాధ, కోపంతో ఉన్నవారి వల్ల ఈ సంఘటన చోటుచేసుకుంది. కానీ రజనీ మాత్రం అజాతశత్రవు. అందుకే ఆయన పేరుకు ముందు పద్మవిభూషణ్ అని వేసినా ఎవ్వరు అభ్యంతరం చెప్పడం లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.