ఆగష్టు 12 నుంచి 23 వరకు కృష్ణ పుష్కరాళను ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉంది. కోట్లాది రూపాయలతో.. ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పనిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ పుష్కరాళలపై భక్తి గీతాన్ని సినీ గేయ రచయిత జొన్నవిత్తుల చేత రాయిస్తున్నారు. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు మరో గాయకుడు పాడనున్నారు. ఇక పుష్కరాల సందర్భంగా నదీమ తల్లికి ఇచ్చే హారతులను, ఇతర దృశ్యాలను చిత్రీకరించే బాధ్యతను మరోసారి బోయపాటిశ్రీనుకే అవకాశం ఇచ్చారు చంద్రబాబు. గోదావరి పుష్కరాళ సమయంలో కూడా ఆయనకే బాబు ఈ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమాలకు వాయిస్ ఓవర్‌ను విజయవాడ పోలీసు బ్రాండ్ అంబాసిడర్ సాయికుమార్‌కు ఇచ్చారు. గోదావరి పుష్కరాళల్లో జరిగిన సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకున్న ఏపీ ప్రభుత్వం కృష్ణ పుష్కరాలలో ఎలాంటి అపశృతి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.