'కబాలి' రిలీజ్ రోజున కూడా అమెరికాలోనే ఉన్న సౌతిండియన్ సూపర్‌స్టార్ రెండురోజుల కిందట ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ఇండియాకు వచ్చిన అనంతరం తన 'కబాలి' చిత్రం కలెక్షన్లపరంగా సృష్టిస్తోన్న సునామీని చూసి.. తనను ఇంతగా అభిమానిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఈమేరకు అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. 'కబాలి'ని ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులku, తనకు అండగా నిలబడిన అందరికీ థ్యాంక్స్ చెప్పారు. 'కబాలి', 'రోబో2.0' చిత్రాల షూటింగ్స్‌లో బిజిగా ఉన్నందున కాస్త విశ్రాంతిని కోరుకున్నాను. అందుకే రిలాక్స్ కావడం కోసం అమెరికా వెళ్లాలని ఆయన తెలిపారు. అమెరికాలో కొద్దిరోజులు ఉండి ఇండియాకు తిరిగి రాగానే 'కబాలి' చిత్రంపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని తెలుసుకున్నానంటూ తన ఆరోగ్యం, 'కబాలి' చిత్రంపై వస్తున్న స్పందన గురించి తన స్వహస్తాలతో తమిళ ప్రేక్షకులకు ఓ లేఖ రాశారు. ఇక 'కబాలి' చిత్ర విషయానికి వస్తే టాక్‌తో సంబంధం లేకుండా ఈచిత్రం రికార్డు కలెక్షన్లను కురిపిస్తోంది. ఇక ఈ చిత్రం మొదటి వీకెండ్‌లో 200కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. 120కోట్లకు పైగా షేర్ సాధించింది. కాగా 'కబాలి' చిత్రం రజనీ రెమ్యూనరేషన్ కాకుండా కేవలం 15కోట్ల బడ్జెట్‌తో తయారైంది.ఈ చిత్రానికి గాను రజనీకి 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. అయితే 'లింగా, కొచ్చాడయాన్'లతో పోలిస్తే 'కబాలి' చిత్రం లోబడ్జెట్ మూవీ కావడంతో నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలనే అందిస్తోంది.