ఏమైంది ఈ నగరానికి. ఒకవైపు పొగ.. మరోవైపు నుసి అంటూ ఓ యాడ్ మనం థియేటర్లకు వెళ్లిన ప్రతిసారి మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని బర్నింగ్‌స్టార్ సంపూ.. పవన్, మహేష్, రజనీలపై సెటైర్లు పేల్చాడు. 'ఈ 2016కి ఏమైంది? ఒకపక్క సర్దార్‌గబ్బర్‌సింగ్, మరోపక్క బ్రహ్మోత్సవం'.. 'కబాలి' కూడా నోరు మెదపలేదు. ఈ నిర్లక్ష్యానికి 'కొబ్బరిమట్ట' పాడాలి చరమగీతం. అంటూ ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోన్న ఓ ట్వీట్‌ను సంపూ రీట్వీట్ చేశాడు. అయితే ఇలా ట్వీట్ చేస్తే పవన్, మహేష్, రజనీ ఫ్యాన్స్ నుంచి ఎదురుదాడి జరుగుతుందని గ్రహించిన సంపూ, దీనిని తాను ట్వీట్ చేయలేదని,ఎవరో చేశారు. సరదాగా తీసుకోండి అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.