Advertisementt

త్రివిక్రమ్ సూచనలతో మారుతి హర్ట్..!!

Wed 27th Jul 2016 05:19 PM
trivikram srinivas,babu bangaram,maruthi,trivikram suggestions to babu bangaram,radhakrishna,a aa  త్రివిక్రమ్ సూచనలతో మారుతి హర్ట్..!!
త్రివిక్రమ్ సూచనలతో మారుతి హర్ట్..!!
Advertisement
Ads by CJ

మారుతీ - వెంకటేష్ కాంబినేషలో తెరకెక్కుతున్న 'బాబు బంగారం' ఆడియో విడుదలై పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ కి జంటగా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించారు. 'బాబు బంగారం' సినిమాని మారుతి అతని పాత చిత్రాలలా కాకుండా ఫామిలీ ఆడియన్స్ కి నచ్చేలా తీశాడని సమాచారం. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఆగష్టు 12 న విడుదలకు సిద్ధమయ్యింది. అయితే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రాధాకృష్ణ తనకు ఇష్టమైన వ్యక్తి త్రివిక్రమ్ కి 'బాబు బంగారం' షో ప్రత్యేకంగా వేసి చూపించాడట. ఈ సినిమా ఆధ్యంతం తిలకించిన త్రివిక్రమ్ కొన్ని సూచనలు చేశాడని సమాచారం. మాములుగా అయితే ఒక దర్శకుడి పనిలో ఇంకో దర్శకుడు వేలు పెట్టడు. అలాగే విడుదలకు ముందు చూసి ఏ విధమైన సజెషన్స్ ఇవ్వరు. మరి త్రివిక్రమ్ 'బాబు బంగారం' సినిమా చూసి ఇది ఇలా ఉంటే బావుంటుంది, అది అలా ఉంటే బావుంటుంది అంటే ఏ దర్శకుడైనా ఫీల్ అవుతాడుగా. ఇక్కడా అదే జరిగింది. ఇలా త్రివిక్రమ్ చెప్పడం తో మారుతికి కొంచెం బాధ అనిపించి తన మిత్రుల దగ్గర బాధపడ్డాడని సమాచారం. మరి త్రివిక్రమ్ సజెషన్ కి స్పందించి ఆ మార్పులు చేర్పులు మారుతీ చేపడతాడా లేక... తాను తీసింది తీసినట్లుగా విడుదల చేస్తాడో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ