తెలంగాణకు ప్రధాని మోదీ రావడం ఆ రాష్ట్ర బిజెపి నాయకులకు ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ..మోడీ తెలంగాణ ప్రభుత్వ పధకం 'మిషన్ భగీరథ' ను తన చేతుల మీదుగా ప్రారంభిస్తే ఆ రాష్ట్ర బిజెపి నాయకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. స్వయానా ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఇందులో జరుగుతున్న అవినీతిపై తాము ఇక టిఆర్‌ఎస్‌ను ప్రశ్నించే అధికారాన్ని కోల్పోతామని, తాము కూడా ప్రధాని కోసం ఆ కార్యక్రమానికి హాజరుకావాల్సివస్తుందని టి.బిజెపి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి.. టిఆర్‌ఎస్‌తో దోస్తీ కడుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇక ప్రధాని రాక కోసం హెలిప్యాడ్ నిర్మాణానికి కొన్ని లక్షల చెట్లను నరికేస్తున్నారని, ఒకవైపు హరితహారం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధాని రాక కోసం లక్షల చెట్లను కొట్టివేయడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.