తమిళ, తెలుగు భాషల్లో మాస్ అండ్ యాక్షన్ హీరోగా ఫామ్‌లో ఉన్న విశాల్, అందాల నటి తమన్నా జంటగా ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం తమిళంలో 'కత్తిసందై' పేరుతో రూపొందుతోంది. ఈ భారీ యాక్షన్ చిత్రానికి సురాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తెలుగులో ఈ చిత్రానికి 'ఒక్కడొచ్చాడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ శరవేగంగా జరగుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విశాల్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో జి.హరి నిర్మిస్తున్నాడు. విశాల్‌కు బాగా సూటయ్యే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.