రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి మొదటి సీఎస్‌గా పనిచేసిన ఐ.వై..కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను చేసి ఆయన సేవలను ఇప్పటికీ చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు. అదే తరహాలో ఏపీకి తొలి డిజిపిగా పనిచేసి ఇటీవలై రిటైర్ అయిన జె.వి.రాముడు సేవలను కూడా ఇంకా వాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నాడట. పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు రాముడు అనుభవం తనకు ఉపయోగపడుతుందని బాబు బావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు కూడా అతి కీలకమైన ప్రభుత్వ శాఖను అప్పగించి ఆయన సేవలను వినియోగించుకోవాలని బాబు భావిస్తున్నాడు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని రాముడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన సేవలను మరో విధంగా ఉపయోగించుకోవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అనుభవజ్ఞులకు పెద్దపీట వేస్తూ చంద్రబాబు తీసుకుంటున్న ఈ నిర్ణయం సత్పలితాలను ఇస్తుందని, ఏపీ ని ప్రగతి పథం వైపు నడిపిస్తుందని ఆశావహులు భావిస్తున్నారు.