ఈనెల 29 నుంచి సూపర్‌స్టార్ మహేష్‌బాబు, డైరెక్టర్ మురుగదాస్‌ల చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఆగష్టు 1 నుంచి ఈ చిత్రం సెట్‌లోకి మహేష్ ఎంటర్ కానున్నాడు. ఇక ఆగష్టు 9వతేదీన మహేష్ బర్త్‌డే ఉంది. ఈ చిత్రంలో మహేష్ లుక్‌కి సంబంధించిన ఫొటోషూట్ కూడా ఎప్పుడో జరిగిపోయింది. దీంతో మహేష్ బర్త్‌డే కానుకగా ఈ చిత్రం ప్రీలుక్ వంటిది విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అని డైరెక్టర్ మురుగదాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ఉన్న మహేష్, మురుగదాస్‌ల చిత్రం అనేసరికి ఈచిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగాన్ని చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీలతో పాటు గుజరాత్, రాజస్దాన్ రాష్ట్రాలలో షూటింగ్ జరపనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మహేష్ సరసన నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌శివన్, హరీస్ జైరాజ్ వంటి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఎన్వీ ప్రసాద్‌తో కలిసి ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.