Advertisementt

పాపం..సింగర్ సునీతకు ఎన్ని కష్టాలో!!

Tue 26th Jul 2016 04:50 PM
singer sunitha,problems to singer sunitha,sunitha respond on rumors,singer sunitha interview  పాపం..సింగర్ సునీతకు ఎన్ని కష్టాలో!!
పాపం..సింగర్ సునీతకు ఎన్ని కష్టాలో!!
Advertisement
Ads by CJ

సింగర్ సునీత అంటే తెలియని వారు ఉండరు. ఆమె తన గాత్రం తో అమృతాన్ని కురిపించినట్లుగా పాడుతుంది. అయితే ఆమె తన జీవితంలో చాలా సంతోషం గా తన భర్త, పిల్లలతో గడుపుతుంది అని అనుకుంటున్నారు చాలామంది. కానీ సునీత నిజ జీవితం లో అలా లేదు . ఆమె తన భర్త నుండి విడిపోయి తన ఇద్దరు పిల్లలతో వేరుగా జీవిస్తుంది. అదేమిటి ఇలా చాలామంది తమ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారుగా... సునీతా ఒక్కర్తే  అలా ఉండడం లేదుగా అనే డౌట్ మీకు రావచ్చు. ఆ డౌట్ రావడం సహజం కూడా.... సునీతకి 19 ఏళ్ళ వయస్సులోనే పెళ్లయింది. కొంత కాలానికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పెళ్ళైన 10 ఏళ్లకే తన భర్త తో సరిపడక ఆమె విడిపోయి తన ఇద్దరి పిల్లలతో కలిసి వుంటున్నారామె. కానీ ఆవిడ తన భర్త నుండి విడాకులు తీసుకోలేదు. ఇన్ని జరిగిన తర్వాత ఆమె  తన కెరిరీర్ లో బిజీ  అయ్యి అన్ని విషయాలను మర్చిపోయి ఆమె జీవితం ఆమె జీవిస్తుంది. అయితే ఈ మధ్య సునీత సింగల్ గా లేకుండా ఒక డైరెక్టర్ ని రహస్యం గా పెళ్లి చేసుకుందని... అంతే కాకుండా ఒక పొలిటీషియన్ తో ప్రేమ వ్యవహారం నడిపిందనే రూమర్స్ ప్రచారం లోకి వచ్చాయి. ఈ వార్తలకు సునీత ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ తాజాగా ఆమె ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఇలాంటి వార్తలను తన భర్త తరుపు వారే ప్రచారం చేస్తున్నారని... తాను ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతే కాకుండా తాను ఒక పొలిటీషియన్ తో ప్రేమలో ఉన్నానన్న మాట కూడా రూమర్ అని కొట్టిపడేశారు. తన భర్తే కుదురుగా ఉంటే తనకి ఇలాంటి కష్టాలు... ఇలాంటి మాటలు తప్పేవని బాధపడుతూ చెప్పారు. అంతే కాకుండా తనకు విడాకులివ్వకుండా తన భర్త తనని వేధిస్తున్నాడని కూడా తెలిపారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ