Advertisementt

వెంకీ ఎందుకు.. ఇరిటేట్‌ అవుతున్నాడు?

Tue 26th Jul 2016 04:17 PM
venkatesh,babu bangaram,venkatesh speech babu bangaram audio launch,victory venki  వెంకీ ఎందుకు.. ఇరిటేట్‌ అవుతున్నాడు?
వెంకీ ఎందుకు.. ఇరిటేట్‌ అవుతున్నాడు?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లోని స్టార్స్‌ అందరినీ కలుపుకుంటూ..మనమంతా ఒక్కటే అనే భావాన్ని వాళ్ళలో కలిగింపజేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అంటే అది ఖచ్చితంగా విక్టరీ వెంకటేషే. ఎప్పుడో ఆగిపోయిన మల్టీస్టారర్‌ శఖాన్ని మళ్ళీ ఇండస్ట్రీకి పరిచయం చేసి పవన్‌, మహేష్‌, రామ్‌ వంటి వారితో కలిసి సినిమాలు చేసిన క్రెడిట్‌ వెంకీది. సోలో హీరోగా వెంకీకి ఈ మధ్య అస్సలు కలిసిరావడం లేదు. దీనివల్లేనేమో..ఎప్పుడూ సౌమ్యంగా, నిరాడంబరంగా ఉండే వెంకీ..బాగా ఇరిటేట్‌ అవుతున్నాడు. ఈ మధ్య మీడియాపై చిరాకుగా మాట్లాడిన వెంకీ తాజాగా జరిగిన 'బాబు బంగారం' ఆడియోలో కూడా కొంచెం లిమిట్స్‌ దాటాడు. ఆడియో వేదికపై వెంకీ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్‌ బాగా అల్లరి చేస్తుండటంతో..ముందుగానే ఏం ప్రిపేర్‌ అయ్యి రాలేదని చెప్పిన వెంకీ..సహనాన్ని కోల్పోయి..అసలే కంగారు..ఆపై ఇలా అల్లరి చేస్తే..ఎలా మాట్లాడను. 30 యేళ్లుగా ఏమీ పీకలేదు స్టేజ్‌ మీద..ఇప్పటికీ అంతే...అంటూ ఎన్నడూ మాట్లాడని విధంగా వెంకీ మాట్లాడి అందరినీ విస్తుపరిచాడు. ఎప్పుడూ మనసు స్వఛ్చంగా, మాట బంగారంగా ఉండే వెంకీ..ఇలా మాట్లాడతాడని ఎవ్వరూ ఊహించిఉండరు. అనుకోని విధంగా వెంకీ మాట్లాడటంతో..కొందరు అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ